బాబు బంగారంపై డవుట్ లే డవుట్ లు

మారుతి డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమా బాబు బంగారం. విక్టరీ వెంకటేష్ చాలా కాలం తరువాత రెగ్యులర్ ఫార్మాట్ లో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా వాస్తవానికి…

మారుతి డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమా బాబు బంగారం. విక్టరీ వెంకటేష్ చాలా కాలం తరువాత రెగ్యులర్ ఫార్మాట్ లో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా వాస్తవానికి జూన్ లో రావాల్సి వుంది. కానీ రాలేదు. జూలైలో వస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆగస్టు అని సడెన్ గా గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. నిర్మాతలు నిన్న మొన్నటి వరకు జూలై 29 పక్కా అన్నారు. 

కానీ కబాలి సినిమా ఎప్పుడు వస్తుందో అన్నది ఇదమిద్దంగా తెలియడం లేదు. మరోపక్క అన్నింటికి మించి నయన తార చాలా అంటే చాలా ట్రబుల్ ఇస్తోందని వినికిడి. ఓ పాట ఆమె చేయాల్సి వుంది. కానీ అది చేయకుండా, దాగుడు మూతలు ఆడేస్తున్నట్లు తెలుస్తోంది. దీని విషయమై కావచ్చు..ప్రస్తుతం డైరక్టర్ మారుతి చెన్నయ్ లో మకాం వేసారు. మరి నయన కరుణించి పాట పూర్తి చేయాల్సి వుంది. జూలై 9న అడియో ఫంక్షన్ అని అన్నారు. కానీ ఇప్పుడు ఆ వైనం వినిపించడం లేదు.

వెన్నాడుతున్న సెంటిమెంట్లు

దీనికి తోడు బాబు బంగారం సినిమాను సెంటిమెంట్లు వెన్నాడుతున్నాయి. వెంకటేష్ పోలీస్ డ్రెస్ వేసుకున్న సినిమాలు ఇంతవరకు అంతగా హిట్ అయిన దాఖలాలు లేవని టాక్ వినిపిస్తోంది. పైగా వెంకటేష్ కు మాస్ సినిమాలు అచ్చిరావు. పైకి బాబు బంగారం అని టైటిల్ అయితే పెట్టారు కానీ, ఈ సినిమా పక్కా మాస్ సినిమా అని తెలుస్తోంది. వెంకీ కి ప్లస్ అయిన ఫ్యామిలీ జోనర్ కాదని వినికిడి.

పైగా ఇటీవల రోజుల మారాయి సినిమా తరువాత ఒక్కసారిగా మీడియా ఫోకస్ అంతా డైరక్టర్ మారుతి మీదకు వెళ్లింది. దాని ఇంపాక్ట్ బాబు బంగారం ఓపెనింగ్స్ మీద ఏ మేరకు వుంటుందో  అన్న అనుమానాలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.