హీరోలతో అంతే..హీరోలతో అంతే..

సాధారణంగా సెలబ్రిటీల దగ్గర పనిచేయడం కత్తిమీద సాములాగే వుంటుంది. అయితే వాళ్ల మనసులు గెల్చుకుంటే, అభిమానం సంపాదిస్తే మాత్రం జీవితం సాఫీగా సాగడానికి చాన్స్ వుంటుంది. అయితే హీరోలతో ఓ సమస్య వుంటుంది..వారి ఎమోషన్లతో…

సాధారణంగా సెలబ్రిటీల దగ్గర పనిచేయడం కత్తిమీద సాములాగే వుంటుంది. అయితే వాళ్ల మనసులు గెల్చుకుంటే, అభిమానం సంపాదిస్తే మాత్రం జీవితం సాఫీగా సాగడానికి చాన్స్ వుంటుంది. అయితే హీరోలతో ఓ సమస్య వుంటుంది..వారి ఎమోషన్లతో సమస్య వస్తుంది. మూడ్ బాగుంటే ఓకె. లేదంటే దాని రిజల్ట్ వీళ్ల మీద పడుతుంది. సిబ్బందికే కాదు..దగ్గరగా వున్న కాస్త దిగువ జనాలకు కూడా ఇదే సమస్యలు ఎదురవుతుంటాయట.

చుక్కల వేళ చుక్కపడితే..

ప్రస్తుతం టాప్ హీరోల జాబితాలో వున్న ఓ సెలబ్రిటీతో స్టాఫ్ కి ఇదే సమస్య అని తెలుస్తోంది. మంచి నటనను పుణికిపచ్చుకున్న ఆ హీరోకి  రాత్రి అయితే పగటి పూట ఎమోషన్లు అన్నీ రియాక్షన్లుగా మారి స్టాఫ్ మీద పడతాయట. పైగా నాలుగు చుక్కులు గొంతులోకి వెళితే..ఇక నా సామి రంగా అన్నట్లు వుంటుందట పరిస్థితి. గాట్టిగా కౌగలించేసుకోవడం, ముద్దులు పెట్టేసుకోవడం వంటి సాదా సీదా వ్యవహారాల నుంచి మాంచి భోజనం ఆపకుండా తినిపించేయడం మీదుగా, గుద్దులు, పిడిగుద్దులు వరకు సాగుతుందట. 

అయితే, ఆ ఒక్క టైమ్ భరించగలిగితే, చాలా మంది కన్నా బాగా చూసుకుంటాడు కాబట్టి, భరిస్తారట.  ఓ సారి ఓ టాప్ డైరక్టర్ కొత్త కారు కొని, సూపర్ కారు కొన్నాఅని తీసుకెళ్లాడట. అంతే డైరక్టర్ ను పక్కన కూర్చోపెట్టుకుని, కారును ఓ లెక్కలో డ్రయివ్ చేసాడట. దాంతో ఆ డైరక్టర్ కు పై ప్రాణాలు పైకి పోయాయట. కిందకు తిగేసరికి వాంతులే వాంతులు.  ఇలా డిఫరెంట్ గా వుంటుందట సదరు హీరోగారి మూడ్. 

జోక్ లే జోక్ లు

ఇంకో టాప్ హీరో వున్నారు..చూడ్డానికి బాగానే వుంటారు కానీ, ఆయనది భలే చిత్రమైన వ్యవహారామట. తన దగ్గర వున్నవాళ్లపై జోక్ లు కట్ చేస్తుంటారు. అందుకోసం ఇద్దరు ముగ్గుర్ని ఆయన ఎప్పుడూ పర్మనెంట్ గా టార్గెట్ చేస్తుంటారు. ఫిజిక్ మీద, బాడీ లాంగ్వేజ్ మీద కాస్త కుళ్లు జోకులు వేసినా, ఫీలవకుండా నవ్వేయాలట. అంతే కాదు, వాళ్ల ముందు ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ల మీద కామెంట్ చేయడం, వీళ్లు నవ్వడం అనే కార్యక్రమం కూడా ఆయనకు బాగా ఇష్టమట. ఆయనకు అదో ఆనందం..వీళ్లకు అవసరం..అంతే మరి.

ఖర్చులు మీవే

కష్టపడి మేకోవర్ అయి, పైకి వచ్చిన మరో టాప్ హీరో వున్నారు. పైసా ఖర్చు చేయాలంటే కష్టమట. సీరియస్ గా ఫోన్ చేసి, ఫలానా ఊరులో ఫంక్షన్ వుంది..వెళ్లి ఏర్పాట్లు చూడు అంటారట. అంతే కానీ ఎలా వెళ్లాలి? అక్కడ ఎలా వుండాలి? ఖర్చులు ఎవరు ఇస్తారు అన్నిది మాత్రం చెప్పరట. దాంతో కక్కలేక మింగలేక ఖర్చులు భరాయించుకోవాల్సిందేనట. పోనీ లోకల్ అయితే ఫరవాలేదు..రేపు ఫలానా స్టేట్ వెళ్దాం అన్నా అదే సీన్ అంట..ఫలానా దేశం వెళ్దాం సరదాగా రా..అనేసి, 'టికెట్ తీసుకుంటావు కదా' అని సింపుల్ గా తేల్చేసుకుంటారట. హీరోలతో అవసరాలు వుంటాయి కాబట్టి, భరించుకోవాల్సిందే.