మా టీవీ అవార్డుల ఉత్సవం పై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇది కేవలం మెగాస్టార్ భజనోత్సవంగా తయారు చేసారని విమర్శలు వినవస్తున్నాయి. స్టేజ్ మీద ప్రదర్శించే పాటల్లో కూడా మెగా పాటలు అధికంగా వుండేలా చూసుకున్నారు. అది వారి మేనేజ్ మెంట్ లో వున్న ఛానెల్..వారి ఇష్టం. అంతవరకు ఓకె. కానీ కమెడియన్ ఆలీ చేత కొన్ని పాటలకు డ్యాన్స్ లు చేయించారు. వీలయినంత ఫన్ పండించడమే ఈ స్కిట్ ఉద్దేశం. అది చక్కగా నెరవేరింది. ఆద్యంతం ఆలీ చేష్టలకు ఆహుతులు నవ్వుతూనే వున్నారు.
కానీ ఈ పాటల్లో సీనియర్ ఎన్టీఆర్, సీరియస్ మెలోడీ సాంగ్..'నా మది నిన్ను పిలిచింది గానమై' (ఆరాధన) పాటకు ఆలీ డ్యాన్స్ చేసారు. జనం దాన్ని కామెడీగా చూసారు..పకపకా నవ్వారు..తప్ప అంతటి మహానుభావుడిని గుర్తుచేసుకుని..అంతటి మంచి పాటను ఆస్వాదించినట్లు కనిపించలేదు. ఏదో కామెడీ ఇమిటేషన్ స్కిట్ చూసినట్లే చూసారు తప్ప. ఎన్టీఆర్ స్టయిల్ హావభావాలను ఆలీ ప్రదర్శిస్తుంటే,.అందరూ నవ్వులే నవ్వులు..
నిజానికి మిగిలిన పాటల మాదిరిగా..ఎన్టీఆర్ పాటను కూడా ఇద్దరు డ్యాన్సర్ల చేత చేయించవచ్చు కదా..మెగా పాటలు వేటినీ ఇలా ఇమిటేషన్ లా కాకుండా మామూలుగానే చేసారు కదా? అంతే కానీ కామెడీ స్కిట్ లు గా చేయలేదు కదా.. మెగా స్టార్ పాటను అలా ఆలీ ఇమిటేట్ చేస్తూ చేసివుంటే..అలా ఎందుకు ప్లాన్ చేయలేదో మరి? అంతే కాదు ఎఎన్నార్ పాటను కూడా అలా ప్లాన్ చేయలేదు..ఎందుకంటే అక్కడ మా టీవీలో నాగ్ కు కూడా ప్రమేయం వుందనేమో?
.పైగా ఈ ప్రదర్శన జరుగుతున్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం అనే జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడే వున్నారు కూడా. సినిమా పాటలకు రికార్డింగ్ డ్యాన్స్ ల మాదిరిగా ప్లాన్ చేయించడం కామన్ కావచ్చు.కానీ ఎన్టీఆర్ లాంటి మహానుభావుల పాటలను కాస్త గౌరవంగా చిత్రీకరించాలి.లేదూ అంటే అభిమానులు బాధపడతారు.