బ్రాహ్మణ..అడియో అలా కానిచ్చేసారు

బ్రాహ్మణ…ఉపేంద్ర నటించిన కన్నడ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ సినిమా పేరు ప్రకటించగానే సహజంగానే బ్రాహ్మణ సంఘాల నుంచి అభ్యంతరాలు వినవచ్చాయి. అయినా ఎవరు పట్టించుకుంటారు..అంతలో అడియో ఫంక్షన్ అన్నారు. Advertisement కానీ ఉన్నట్లుండి…

బ్రాహ్మణ…ఉపేంద్ర నటించిన కన్నడ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ సినిమా పేరు ప్రకటించగానే సహజంగానే బ్రాహ్మణ సంఘాల నుంచి అభ్యంతరాలు వినవచ్చాయి. అయినా ఎవరు పట్టించుకుంటారు..అంతలో అడియో ఫంక్షన్ అన్నారు.

కానీ ఉన్నట్లుండి క్యాన్సిల్ చేసారు. మళ్లీ చేస్తారు అనుకుంటే..సింపుల్ గా దర్శకుడు దాసరి ఇంట్లో కానిచ్చేసారు. ఇలా అడియో ఫంక్షన్ క్యాన్సిల్ కావడానికి, మళ్లీ ప్లాన్ చేయకుండా సింపుల్ గా కానిచ్చేయడానికి కారణం, బ్రాహ్మణ సంఘాల అభ్యంతరం అనే తెలుస్తోంది.

అడియో ఫంక్షన్ దగ్గరకు బ్రాహ్మణ సంఘాల జనాల ఎవరైనా వచ్చి నిరసన వ్యక్తం చేస్తారేమో..అనవసరంగా రచ్చ..ఆపైన అది పెరిగి..పేరు ఏమన్నా మార్చాల్సి వస్తుందేమో అన్న అనుమానంతోనే అడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేసి, సైలెంట్ గా కానిచ్చేసారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజమెంతో తెలియదు కానీ, రెడ్డి, చౌదరి, శాస్త్రి, రాజు, క్షత్రియ, నాయుడు, అన్న పేర్లతో సినిమాలు వచ్చినపుడు ఈ పేరుకు మాత్రం ఎందుకు అభ్యంతరం. ఎటొచ్చీ..ఫలానా కులాల పేర్లు వాడితే మాత్రం..జనం రోడ్డెక్కుతారు..తేడాలొచ్చేస్తాయి..ప్రభుత్వం కూడా దిగివచ్చి, సినిమాను పక్కన పెట్టమంటుంది..అన్న భయం వుంటుంది చూడండి..ఆ పేర్ల జోలికి మాత్రం వెళ్లమన్నా వెళ్లరు.