Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ ఖర్చులకు నెలకు 15 లక్షలు?

త్రివిక్రమ్ ఖర్చులకు నెలకు 15 లక్షలు?

హారిక హాసిని బ్యానర్ కు, దర్శకుడు త్రివిక్రమ్ కు విడదీయలేని బంధం. ఆ బంధం ఏమిటోవారికే తెలియాలి. త్రివిక్రమ్ తో సినిమాలకే హారిక హాసిని బ్యానర్. మిగిలిన సినిమాలకు సితార ఎంటర్ టైన్ మెంట్స్. హారికహాసిని కి త్రివిక్రమ్ కు మధ్య కుదిరిన ఒప్పందం ఏమై వుంటుంది అని సినిమా వార్తల కోసం గాలించేవారికి ఆసక్తి. అందుకు సంబంధించిన చిన్న ఫీలర్ తెలిసింది.

అ..ఆ సినిమా కోసమో, లేదా పర్మనెంట్ గానో..హారిక హాసినికి..త్రివిక్రమ్ కు మధ్య ఓ ఒప్పందం కుదరిందని వార్తలు వినిపిస్తున్నాయి. నెలకు 15 లక్షలు త్రివిక్రమ్ కు నెలకు ఇవ్వాలట. అదికాక, సినిమాకు 10 కోట్లు ఇవ్వాలట. అంటే మొత్తం మీద 11.80 కోట్లు అన్నమాట. బ్లాక్ బస్టర్లు ఇచ్చే దర్శకుడు కదా మరి. ఆ మాత్రం రేంజ్ వుంటుంది మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?