అవును.. తెలుగుదేశం అను ‘కుల’ మీడియా నిత్యం గోల పెడుతున్నది ఇదే. లోకేష్ బాబు తన పాద యాత్రలో చాటుతున్నది ఇదే. పవన్ బాబు పదే పదే ఊగిపోతూ చెబుతున్నది ఇదే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 1956 లో ఏర్పడింది. పోనీ కాంగ్రెస్ పాలకులు సరిగ్గా పట్టించుకోలేదు. అందుకే తెలుగుదేశం ఆవిర్బవించింది. తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ రామ రాజ్యాన్సి స్థాపించారు. మూడు పర్యాయాలు.. అక్షరాలా మూడు సార్లు ముఖ్య మంత్రిగా వున్నారు.
ఇక ఘనత వహించిన చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా వున్నారు. 1995-99, 1999-2004, 2014-2019.. ఇలా మూడు సార్లు పదవిలో వున్నారు.
వీరిద్దరూ కాక మధ్యలో సిఎమ్ లుగా వున్న రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య సంగతి సరే సరి.
వీళ్లెవరూ సాధించలేనిది జగన్ నాలుగేళ్లలో సాధించలేదు. ఆసుపత్రులు అన్నీ జగన్ హయాంలోనే అఘోరించినట్లు.. అంతకు ముందు ఎన్టీఆర్, చంద్రబాబు ఏం చేసినట్లు? లోకేష్ కు కనీసం తన తాత, తన తండ్రి మూడు సార్లు అధికారం చెలాయించారని తెలుసా? మరి వాళ్లే చేసారో ఓ సారి ఆలోచించవచ్చు కదా.
చంద్రబాబు హయాంలో అభివృద్ది చేసిన ఆసుపత్రులు ఎన్ని? జగన్ హయాంలో ఆసుపత్రులకు సమకూర్చిన సదుపాయాలు ఏ మేరకు. ఓ సారి లెక్కలు తీయవచ్చు కదా. ఏరంగంలో చూసినా, జగన్ ఏమీ చేయలేదు. మరి చంద్రబాబు, ఎన్టీఆర్ ఏం చేసారో చెప్పవచ్చు కదా. ఇదిగో వాళ్లు చేసినది.. వీళ్లు చేయనిది అని చెప్ప వచ్చు కదా.
ఇదిలా వుంచుదాం. ఇంకా చిత్రం చూద్దాం.
స్కూళ్లలో పిల్లలు అక్షరాలు సరిగ్గా చదవలేకపోతున్నారు. నిజమే కావచ్చు. దానికి తప్పు ఎవరిది? ప్రభుత్వం నుంచి లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్న టీచర్లది కాదా? జగన్ ది తప్పా? సిగ్గుందా ఈ మాట అనడానికి? ప్రభుత్వం జీతాలు ఇస్తుంది.. వాటికి తగినట్లు అక్షరాలు నేర్పకపోతే తప్పు ఎవరిది?
వేల జీతాలు ఇస్తోంది తమ సిబ్బందికి ఈ ‘కుల’ మీడియానే. ఓ సబ్ ఎడిటర్ బాగా రాయకపోతే, తప్పులు రాస్తే బాధ్యత యాజమాన్యానిదేనా? వాళ్లను దండించదా? మనదే తప్పు అని తమ చెంపలు తామే వాయించుకుంటారా?
ఇలాంటి రాతలు చూస్తేనే అసహ్యం వేస్తుంది. మరీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, జగన్ మీద ద్వేషాన్ని వాంతి మాదిరిగా కక్కుకుంటూ రాసుకుంటూ పోతున్నారు.
జనం ఎప్పుడు నిజం గ్రహిస్తారో ఈ ‘కుల’ మీడియా వైనాన్ని.