నైజాం బుకింగ్ బాగా స్లో ‘బ్రో’

పవన్ కళ్యాణ్ సినిమా నైజాం ఓపెనింగ్ అంటే ఎలా వుండాలి. ఓ రేంజ్ లో వుండాలి. ఓపెన్ చేసిన కాస్సేపటికే బుక్ మై షూ దద్దరిల్లిపోవాలి. టికెట్ ల కోసం ఫ్యాన్స్ అటు ఇటు…

పవన్ కళ్యాణ్ సినిమా నైజాం ఓపెనింగ్ అంటే ఎలా వుండాలి. ఓ రేంజ్ లో వుండాలి. ఓపెన్ చేసిన కాస్సేపటికే బుక్ మై షూ దద్దరిల్లిపోవాలి. టికెట్ ల కోసం ఫ్యాన్స్ అటు ఇటు పరుగెట్టాలి. కానీ నిన్న ఓపెన్ చేసినా ఇంకా ఈ రోజుకు చాలా థియేటర్లలో టికెలు అందుబాటులో వున్నాయి. 

ప్రసాద్, ఎఎఎ, ఎఎంబి లాంటి చోట్ల తప్ప మిగిలినవి చాలా స్లోగా కట్ అయ్యాయి. బుధవారం సాయంత్రానికి మెల్లగా ఫుల్స్ కనిపించడం ప్రారంభమైంది. కానీ విడుదల తరువాత రెండో రోజు, మూడో రోజు అయిన శని, ఆదివారాలు బుకింగ్ అలాగే వుండిపోయింది. పెద్దగా కదలడం లేదు.

చిన్న సినిమాలకు అయితే ఇది కామన్. కానీ పవర్ స్టార్ లేదా ఇంకా ఆ రేంజ్ హీరోల సినిమాలు వస్తుంటే ఆరంభంలోనే మూడు రోజులకు టికెట్ లు తెగిపోతాయి. చిన్న, మీడియం సినిమాలకు మొదటి రోజు టాక్ చూసి మిగిలిన రెండు రోజుల రన్ వుంటుంది. 

బ్రో అనేది పెద్ద సినిమా. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు, పవన్ హీరోగా సినిమా అంటే దాని రేంజ్ వేరుగా వుండాలి. భీమ్లానాయక్ తరువాత సినిమా ఇది. కానీ ఆ ఊపు ఇంకా అందుకోలేదు. కనిపించడం లేదు.

పవన్ ఫ్యాన్స్ దృష్టి అంతా ఉస్తాద్, ఓజి సినిమాల మీద వుంది. బ్రో సినిమా మీద ఎందుకో వారికి అంత ఆసక్తి లేదనే చెప్పాలి. సినిమా విడుదలై బాగుంది అనిపించుకుంటే ముందుకు వెళ్తుంది. లేదంటే ఈ తరహా ఓపెనింగ్ అంటే బయ్యర్ కు కాస్త కష్టమే. భీమ్లా నాయక్ సినిమా నైజాం 27 కోట్ల వరకు వసూళ్లు సాగించింది.బ్రో సినిమా 33 కోట్ల మేరకు వసూలు చేయాల్సి వుంది నైజాంలో. ఇదంతా సినిమా విడుదలయిన తరువాత టాక్ ను బట్టే వుంటుంది.