దిశా పఠానీ… ఫెమినా మిస్ ఇండియలో రన్నరప్ గా నిలిచింది. ఆ గుర్తింపుతో మోడలింగ్ చేస్తూ యాడ్ ఫిల్మ్ లలో నటిస్తూ కాలం గడుపుతున్న ఆమెకు పూరీ జగన్నాథ్ అవకాశమిచ్చాడు. వరుణ్ తేజ్ ను హీరోగా పెట్టి తను రూపొందిస్తున్న ‘లోఫర్ ‘ లో ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాలో దిశా అందానికి మంచి మార్కులే పడినా… సినిమా కాస్తా డిజాస్టర్ గా నిలిచిపోవడంతో దిశాను తెలుగునాట పట్టించుకునే వారు లేకపోయారు.
అయితే ఆమెకు బాలీవుడ్ లో అదృష్టం కలిసొచ్చింది. ఏకంగా ఎమ్ ఎస్ ధోనీ బయోపిక్ లో దోనీ భార్య సాక్షి పాత్రకు సెలెక్ట్ అయ్యింది! మరి ధోనీ పై సినిమా అంటే దానికి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. దీంతో దిశా దశ ఈ సినిమాతో తిరిగిపోవనూ వచ్చు. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు దిశ బాలీవుడ్ లో బాయ్ ఫ్రెండ్ ను కూడా సంపాదించేసినట్టుగా పుకార్లు గుప్పుమంటున్నాయి.
అది కూడా ఒక సినీ వారసుడు ఆమె కొంగుకు చిక్కుకున్నాడని టాక్. అతడు మరెవరో కాదు.. జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్ట్రాఫ్. ఇటీవలే హీరోగా ఆరంగేట్రం చేసిన టైగర్ కు లేత వయసులో ఉన్న దిశాకు మధ్య ప్రేమాయణం నడుస్తోందని ఇప్పుడు టాక్. పైకేమో లేదు లేదంటున్నా.. వీళ్లిద్దరి అనుబంధం చాలా లోతుకే వెళ్లిందని వారి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి దిశ దశ బాగున్నట్టే ఉంది!