సర్దార్ గబ్బర్ సింగ్.. పవన్ కళ్యాణ్, తన మిత్రుడు శరద్ మురార్ తో కలిసి ఈరోస్ సంస్ధ భాగస్వామ్యంతో నిర్మించిన సినిమా. అయితే దీని తరువాత సూర్య డైరక్షన్ లో పవన్ చేయబోయే సినిమాకు ఈరోస్ పార్టనర్ గా వుంటుందా అన్నది కాస్త అనుమానంగా వుంది. ఈ సినిమాను స్వంతంగానే చేయాలని పవన్ అనుకుంటున్నట్లు బోగట్టా.
నిజానికి ఈరోస్ సంస్థతో సినిమా చేయడం అన్నది నిర్మాతలకు ఓ విధంగా బాగానే వుంటుంది. కానీ ఈరోస్ లాంటి కార్పొరేట్ సంస్థతో వ్యవహారాలు కాస్త ఇబ్బందిగా వుంటాయి. ప్రతి చిన్నదానికి ముందుగా అనుమతి, ఈమెయిళ్లు, ఓకె చేయించుకోవడాలు..ఇలా తలనొప్పులు చాలా వున్నాయి. సవాలక్ష రూల్స్, రెగ్యులేషన్లు..
అది ఒక కారణమైతే పవన్ తన డిజాస్టర్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ బయ్యర్లకు నోటి హామీ ఇచ్చారన్నది మరో కారణం. లాస్ లో ఫిఫ్టీ పర్సంట్ అయినా తరువాత సినిమా హక్కుల దగ్గర కవర్ చేస్తా అని బయ్యర్లు పవన్ – శరద్ హామీ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.
భారీ నష్టాలు
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బయ్యర్లకు భారీ నష్టాలు చవిచూపించింది. నైజాం బయ్యర్ పది కోట్ల మేరకు పోగొట్టుకున్నట్లు బోగట్టా. ఈరోస్-నిర్మాత అక్కౌంట్ లో ఇరవై కోట్లు అమ్మకం చూపించేసారు. మళ్లీ ఇంద్ర ఫిలింస్, ఈరోస్ కలిసి ఆ సినిమాను భాగస్వామ్యంతో పంపిణీ చేసారు. అక్కడ చెరో అయిదుకోట్లు పోయింది. అంటే ఈరోస్ కు ఈ చేతిలో లాభం..ఆ చేతిలో నష్టం అన్నమాట. ఉత్తరాంధ్ర బయ్యర్ కు మూడు కోట్ల వరకు దెబ్బ పడింది. మిగిలిన వారందరికీ కూడా ఈ రేంజ్ లో కాకున్నా ఎవరి లెవెల్లో వారికి అనుభవం అయిపోయింది.
సో, తరువాతి సినిమా వీలయినంత తక్కువలో చేసి, బయ్యర్లకు తక్కవలో ఇవ్వాలని పవన్-శరద్ భావిస్తున్నట్లు బోగట్టా. ఇలా చేయాలంటే, ఈరోస్ తో భాగస్వామ్యం వుంటే వీలు కాదు. అందువల్లే స్వంతంగా నిర్మిద్దామన్న ఆలోచనలో వున్నారు. లేదూ, ఈరోస్ కనుక ఈ కండిషన్లకు ఓకె అంటే అప్పుడు ఆలోచిస్తారు.