రేపు వరుణ్ తేజ్ కొత్త సినిమా లాంఛ్ కాబోతోంది. కరుణకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు సంబంధించి ఒకేసారి అన్ని అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్.
వరుణ్ తేజ్ కెరీర్ లో 14వ చిత్రం ఇది. వైర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మిస్తారు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్లను లాక్ చేశారు.
వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుంది. ఇక మరో హీరోయిన్ గా నోరా ఫతేహి నటించనుంది. స్పెషల్ సాంగ్స్ తో పాపులరైన ఈ భామ, ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ చేస్తూనే, కీలక పాత్రలో కనిపించనుంది.
ఇక సినిమా కథ విషయానికొస్తే.. 1960 బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది వరుణ్ తేజ్ సినిమా. సినిమా మొత్తం వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఇతర నటీనటులతో పాటు, మ్యూజిక్ డైరక్టర్ ఎవరనే విషయాన్ని రేపు వెల్లడిస్తారు.
ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న గాండీవధారి అర్జున సినిమా షూటింగ్ పూర్తయింది. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా (ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు) షూటింగ్ స్టేజ్ లో ఉంది.
కరుణ కుమార్ సినిమాకు వరుణ్ తేజ్ ఆల్రెడీ కాల్షీట్లు కేటాయించాడు. గతంలో పలాస, శ్రీదేవి సోడాసెంటర్, కళాపురం సినిమాలు తీశాడు కరుణకుమార్.