సూపర్ హిట్టయిన డిజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది టిల్లూ స్క్వేర్. కథలో ఎన్ని మార్పుచేర్పులు జరిగాయో అప్పుడే చెప్పలేం కానీ, టిల్లూ క్యారెక్టరైజేషన్ మాత్రం సేమ్ టు సేమ్ ఉంది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా పాటల హంగామా మొదలైంది.
ఫస్ట్ లిరికల్ వీడియోగా 'టిక్కెట్టే కొనకుండా' అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట కోసం డీజే టిల్లూ సెంటిమెంట్ ను యాజ్ ఇటీజ్ గా ఫాలో అయినట్టు కనిపిస్తోంది.
డీజే టిల్లూ సినిమాకు ఓ హైప్ తీసుకొచ్చిన టైటిల్ సాంగ్ ను రామ్ మిరియాల ఆలపించాడు. కాసర్ల శ్యామ్ రాశాడు. మొదటి సాంగ్ గా అప్పట్లో అదే రిలీజ్ చేశారు. ఇప్పుడు టిల్లూ స్క్వేర్ కోసం కూడా సేమ్ సెంటిమెంట్ ఫాలో అయ్యారు.
'టిక్కెట్టే కొనకుండా' సాంగ్ ను కాసర్ల శ్యామ్ రాయగా, రామ్ మిరియాల ఆలపించాడు. మ్యూజిక్ కూడా అతడే కంపోజ్ చేశాడు. టిల్లూ స్క్వేర్ కు ఇదే మొదటి సాంగ్.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ఒరిజినల్ మ్యూజిక్ డైరక్టర్ శ్రీచరణ్ పాకాల. ఈ ఒక్క సాంగ్ ను మాత్రం సెంటిమెంట్ కొద్దీ రామ్ మిరియాలతో కంపోజ్ చేయించి, పాడించినట్టున్నారు.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా ఇది. శ్రీకర స్టుడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ లిరికల్ వీడియో చూస్తుంటే.. టిల్లూ స్క్వేర్, యూత్ కు బాగా పట్టేలా కనిపిస్తోంది.