మన మీడియా మహ ముద్దుగా వుంటుంది.. కానీ ఎక్కడైనా బావే కానీ వంగ తోట దగ్గర కాదు అనే టైపు మన మీడియా.. ఫ్రెండ్లీగా వున్నట్లే కనిపిస్తుంది.. తేడా వస్తే, అక్కడిక్కడే నిలదీస్తుంది.. ఆఫ్ కోర్స్ ఏ సిద్దాంతానికైనా కొన్ని మినహాయింపులు వున్నట్లు మన మీడియాకు చంద్రబాబు మినహాయింపు.. అది వేరే విషయం.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు అంత హైప్ రావడానికి కారణం ఎవరు.. మన మీడియానే. పవన్ అభిమానులు ఎంతమందయినా వుండొచ్చు.. కానీ రెండేళ్ల పాటు ఆ సినిమాను వార్తల్లో మోసింది తెలుగు మీడియానే. కానీ పవన్ విడుదల దగ్గర కాగానే తెలుగు మీడియాను పక్కన పెట్టి, జాతీయ మీడియాను చంకన ఎత్తుకున్నారు. అయినా మన మీడియా సినిమాను బాగానే ప్రమోట్ చేసింది.
సినిమా విడుదలయింది..ఇక సినిమాపై సంగతులు అయిపోయాయి. మిగిలింది సినిమా వ్యవహారమే.. నో మొహమాటమ్స్.. సినిమా ఎలా వుందీ.. కలెక్షన్ల సంగతేమిటీ అన్నదే క్వశ్చను.. అప్పుడు పవన్ అండ్ కో కు తెలుగు మీడియా గుర్తుకు వచ్చింది. అది కూడా సెలక్టివ్ గా మాత్రమే. అక్కడితో సినిమా మరోసారి గాల్లోకి లేచేస్తుందనుకున్నారు.. కానీ సినిమా కిందకు దిగుతుంటే ఎవరు మాత్రం పైకి లేపగలరు..
పైగా పవన్ సినిమా గురించి కన్నా రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడారు. దీంతో జనం కూడా సినిమా సంగతి మరిచిపోయి..రాజకీయాలే మాట్లాడడం ప్రారంభించారు. దాంతో కలెక్షన్లు పెరగకపోగా తగ్గడం ప్రారంభించాయిు.
ఇప్పుడే ఇలా వుంటే ఎన్నికల వేళ ఇంకెలా?
సినిమా మీడియాకు పొలిటికల్ మీడియాకు కాస్త తేడా వుంటుంది. సినిమా మీడియా కాస్త ముందు వెనుక ఆలోచిస్తుంది కానీ పొలిటికల్ మీడియా అలా కాదు. కానీ సినిమా మీడియాను పట్టించుకునీ, పట్టించుకోనట్లు ముందుకు వెళ్లిన, వెళ్తున్న, భవిష్యత్ లో పార్టీ పెడితే ఎలా వుంటుందో? అప్పుడు పొలిటికల్ మీడియా ఇంకా సూటిగా వుంటుంది. అస్సలు మొహమాట పడదు. .దాటవేయడాలు.. ఒకటి అడిగితే ఇంకొటి చెప్పడాలు, ఇలాంటివి దాని ముందు చెల్లవు.
అందువల్ల ఇప్పుడే ఇలా మీడియా సెగ తగిలిన పవన్ అప్పుడు ఇంకెంత సెగ రుచి చూడాల్సి వస్తుందో? ఎందకుంటే పవన్ దేనికీ సూటిగా సమాధానం చెప్పరు.. అవును అని కానీ కాదని కానీ అనరు.. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తారు. అప్పుడు ఇలాంటి వ్యవహారాలన్నీ విమర్శకు గురి అవుతాయి. సర్దార్ అనుభవంతోనైనా పవన్ మీడియాను సరిగ్గా ఫేస్ చేస్తే మంచిదేమో?