పవన్.. శరద్.. ముందు జాగ్రత్త?

సాధారణంగా టాలీవుడ్ లో ఓ పద్దతి వుంది. సినిమాలు ఫ్లాప్ అయితే, బయ్యర్లకు ఇరవై శాతం కన్నా ఎక్కువ నష్టం వాటిల్లితే, నిర్మాత రిటర్న్ ఇవ్వాలి. ఇదంతా ఓ పెద్ద ప్రాసెస్..ఒక రోజు రెండు…

సాధారణంగా టాలీవుడ్ లో ఓ పద్దతి వుంది. సినిమాలు ఫ్లాప్ అయితే, బయ్యర్లకు ఇరవై శాతం కన్నా ఎక్కువ నష్టం వాటిల్లితే, నిర్మాత రిటర్న్ ఇవ్వాలి. ఇదంతా ఓ పెద్ద ప్రాసెస్..ఒక రోజు రెండు రోజుల్లో తేలే యవ్వారం కాదు..సినిమా  రన్ అంతా ముగియాలి..లెక్కలు తేలాలి..చాంబర్ లో పంచాయతీలు ఇలా చాలా వుంటాయి.

అయితే టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో ఓ కొత్త సంగతి వినిపిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను ఏరియాల వారీ అమ్మినపుడు ముందు జాగ్రత్తగా ఇలాంటి 20 శాతం క్లెయిమ్ లు వంటివి చేయమని, స్వంత రిస్క్ పై కొంటున్నామని క్లాజ్ పెట్టి అగ్రిమెంట్ చేయించుకున్నారని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఇలా ముందే రాయించారు అంటే, సినిమా బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ కాదని ముందే అనుమాన పడ్డారా అని అనిపిస్తోంది.

ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ పరిస్థితి చూస్తుంటే కష్టంగానే వుంది. కృష్ణలో సగం డబ్బులు వచ్చాయి ఇఫ్పటికి. ఇంకా రెండున్నర కోట్లు రావాలి. ఉత్తరాంధ్ర మూడు కు పైగానే ఇంకా రావల్సి వుంటుందని అంచనా. ఇలా చాలా ఏరియాల పరిస్థితి ఇదే.  మరి అలాంటపుడు ఈ నిబంధన నిజంగా అగ్రిమెంట్ లో వుంటే కనుక బయ్యర్లకు కష్టమే.

జిల్లాల వారీ లేదా, థియేటర్ల వారీ అమ్మేసుకుంటే ఫరవాలేదు లేదూ అంటే ఆలోచించాల్సిన పరిస్థితే. ఉత్తరాంధ్ర బయ్యర్ క్రాంతి రెడ్డి ఇప్పటికే అఖిల్, బ్రూస్ లీ దెబ్బలు తిని వున్నారు. ఇప్పుడు సర్దార్ దెబ్బ గట్టిగానే పడేలా వుంది అంటున్నారు.

ఒకటి రెండు రోజులు ఆగితే అన్ని లెక్కలు కలుగుల్లోంచి మెల మెల్లగా బయటకు వస్తాయి.