మూడోసారైనా వైట్ల ఓకెనా?

శ్రీనువైట్ల ఇప్పటికి రెండు సార్లు ప్రయత్నించాడు మెగా హీరోలతో ఓ హిట్ కొట్టాలని, రెండు సార్లు రెండు డిజాస్టర్లు ఇచ్చాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నం చేస్తున్నాడు వరుణ్ తేజతో. ముకుంద.. కంచె.. లోఫర్…

శ్రీనువైట్ల ఇప్పటికి రెండు సార్లు ప్రయత్నించాడు మెగా హీరోలతో ఓ హిట్ కొట్టాలని, రెండు సార్లు రెండు డిజాస్టర్లు ఇచ్చాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నం చేస్తున్నాడు వరుణ్ తేజతో. ముకుంద.. కంచె.. లోఫర్ అంటూ మూడు సార్లు సక్సెస్ కోసం ప్రయత్నించి విఫలమైన వరుణ్ తేజ తో మెగా హిట్ కోసం శ్రీను వైట్ల మూడో ప్రయత్నం చేయడం భలే ఈక్వేషన్. 

ఈ నెలాఖరు నుంచి షూటింగ్ పార్ట్ ప్రారంభిస్తోందీ సినిమా. స్క్రిప్ట్ సూపర్ గా వచ్చిందని శ్రీను వైట్లు సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఏదీ నమ్మలేకుండా వుంది. సినిమా విడుదల గంటలో వుందనే వరకు కూడా సూపరంటే సూపరు అంటున్నారు. 

తెర మీద బొమ్మ పడ్డాక కానీ రంగు అసలు హంగు తెలియడం లేదు. మరి శ్రీను వైట్ల ఈ సారి ఏం చేస్తాడో వరుణ్ తేజతో… వెయిట్ అండ్ సీ.