తెరవెనుక ఎన్ని ఆనందాలో?

ఒకరి ఓటమి ఎదురైతే మరొకరు సంతోషించడం అన్నది జనాల్లో కామన్.  పొరుగు పచ్చ ఓర్వరు అన్నది సామెత కూడా. అయితే పవన్ కళ్యాణ్ సినిమా సర్దార్ పరాజయంపై ‘అంతకు మించి’ సంతోషం టాలీవుడ్ ఇన్నర్…

ఒకరి ఓటమి ఎదురైతే మరొకరు సంతోషించడం అన్నది జనాల్లో కామన్.  పొరుగు పచ్చ ఓర్వరు అన్నది సామెత కూడా. అయితే పవన్ కళ్యాణ్ సినిమా సర్దార్ పరాజయంపై ‘అంతకు మించి’ సంతోషం టాలీవుడ్ ఇన్నర్ స్కర్కిళ్లలో వ్యక్తం అవుతోంది. అసలే టాలీవుడ్ రకరకాల ఈక్వేషన్లతో రకరకాల గ్రూపులతో వుంటుంది. ఒకరికి విజయం వస్తే ఆనందించే వాళ్లు ఎంతమంది వుంటారో, బాధపడేవాళ్లు అంతే మంది వుంటారు. అపజయం వచ్చినా అదే టైపు.

పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు సర్దార్ పరాజయం సంప్రాప్తించడంతో తెరవెనుక చాలా మంది ఆనందిస్తున్నారు. పవన్ సినిమాలో కనెక్షన్ వున్న ఓ డైరక్టర్ అయితే ‘భలే అయింది..డైరక్షన్ అంటే అంత వీజీనా..’ అంటూ కామెంట్ చేసారని, అంతే కాకుండా మీడియాలో తనకున్న పరిచయాలతో, నెగిటివ్ ను స్ప్రెడ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవన్ ను అందరూ దేవుడు దేవుడు అంటూ తెగ గాలి కొట్టారని, దాంతో ఆయన నిజంగా తాను దేవుడు..తానేం చేసినా నడుస్తుందన్న రీతిలో సినిమా చేసారని ఓ నిర్మాత కామెంట్ చేసినట్లు వినికిడి.

నిజానికి సెన్సార్ చేసినపుడే ఓ సినిమా పర్సనాలిటీ చూసారట. తరువాత తన ఇన్నర్ సర్కిళ్లతో ‘ఈ సినిమా ఆడితే ఇంక ఏ సినిమా ఫ్లాప్ కావడం వుండదని సెటైర్ వేసారట.

పవన్ కు ఫ్యాన్స్ మీద మరీ భరోసా పెరిగిపోయిందని, తాను చెయ్యి కదిపితే చాలు, వారు ఆనందించేసారనే ధీమా, నటనపై నిర్లక్ష్యం అడుగడుగునా స్పష్టంగా కనిపించిందని మరో నిర్మాత పలువురి దగ్గర అన్నట్లు వినికిడి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి కొందరు జనాలు పవన్ కళ్యాణ్ ను మరీ ఆకాశానికి ఎత్తేసి, అనవసరంగా పాడు చేసారని మరి కొన్ని కామెంట్ లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.