ఏదైనా కష్టం వస్తే, వెళ్లి పరామార్శించడం అన్నది మన సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని తూ చ తప్పకుండా పాటించారు.. పవన్ కళ్యాణ్. బ్రూస్ లీ సినిమా పరాజయం పాలు కాగానే హుటాహుటిన పవన్ షూటింగ్ స్పాట్ నుంచే అన్న చిరంజీవి ఇంటికి వెళ్లిపోయారు. షూటింగ్ లో వేసుకున్న పోలీస్ డ్రెస్ విప్పకుండా, పబ్లిక్ లో ఆ డూప్ డ్రెస్ తోనే వెళ్లిపోయారు.
అన్నను, అన్న కుమారుడిని పలకరించి, ఫొటోలు దిగి, భరోసాగా, త్వరలో తానే నిర్మాతగా చెర్రీతో ఓ సినిమా కూడా చేస్తానని ప్రకటించారు. కట్ చేస్తే.. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలయింది. ఇప్పుడు పవన్ టైమ్ వచ్చింది. సినిమాకు ఓపెనింగ్స్ ఎలా వున్నా, సినిమా ఫ్లాప్ అన్నది పక్కా అయింది.
మరి పాపం, తమ్ముడు పవన్ కు ఇంత కష్టం వచ్చినందుకు అన్న చిరు.. బాబాయ్ ను అనునయించేందుకు చరణ్ బయల్దేరి వెళ్లాలి కదా? అదెప్పుడు అన్నది ఇప్పుడు టాలీవుడ్ సర్కిళ్లలో ఆసక్తికరంగా వుంది. మనిద్దరమో, లేదా ముగ్గురమో కలిసి ఓ మల్టీస్టారర్ చేద్దాం అని కూడా ఓ మాట అనుకోవచ్చు కదా?