చంద్రబాబు – పొత్తులపై పిచ్చి ప్రేలాపనలు!

వన్ సైడ్ లవ్ దగ్గరినుంచి.. త్యాగాలకు సిద్ధం అనేదాకా.. రకరకాల రూపాల్లో చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల సమయానికి ఎవరెవరితో పొత్తులు పెట్టుకుందామా అని ఉవ్విళ్లూరుతున్నారు. ఎవరి భుజాల మీద ఎక్కి ఎన్నికల సవారీ పూర్తిచేద్దామా…

వన్ సైడ్ లవ్ దగ్గరినుంచి.. త్యాగాలకు సిద్ధం అనేదాకా.. రకరకాల రూపాల్లో చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల సమయానికి ఎవరెవరితో పొత్తులు పెట్టుకుందామా అని ఉవ్విళ్లూరుతున్నారు. ఎవరి భుజాల మీద ఎక్కి ఎన్నికల సవారీ పూర్తిచేద్దామా అని ఎగబడి నిరీక్షిస్తున్నారు. 

ఈ పొత్తుల ఆరాటం గురించి.. వైసీపీ నాయకులు ఎగతాళి చేస్తోంటే తట్టుకోలేకపోతున్నారు. కానీ ఎలా రిటార్టు ఇవ్వాలో మాత్రం తెలియదు. వారి విమర్శలపై ఎదురుదాడి చేయడానికి ఆయన పడుతున్న పాట్లు చూస్తోంటే జాలి కలుగుతోంది.

మాకు పొత్తుల అవసరం లేదు.. సింగిల్ గానే వస్తాం.. అని వైసీపీ నాయకులు చెబుతోంటే.. చంద్రబాబునాయుడు ఆ సంగతి వదిలేసి.. మీ నాన్న పొత్తులు పెట్టుకోలేదా? అప్పట్లో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం లతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లింది కదా అనే సంగతిని ప్రస్తావిస్తున్నారు. 

ఇంత చవకబారు ప్రతివిమర్శ బహుశా మరొకటి ఉండకపోవచ్చు. ఎందుకంటే.. కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ. వైఎస్ హయాంలో అయినా సరే.. అధిష్ఠానం నిర్ణయాలు ప్రబలంగానే ఉంటాయి. ఒకవేళ వైఎస్ నిర్ణయంతోనే పొత్తులు పెట్టుకున్నారని అనుకుందాం. అయితే ఆ పొత్తులను జగన్ మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తానన్న మాటతో ఎలా పోలుస్తారు.

వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉన్నదో, అంతకంటె.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ఉన్నదని దాని అర్థం కదా. వైఎస్సార్ కొడుకు తండ్రి పేరిట స్థాపించిన పార్టీని.. కాంగ్రెస్ కంటె బలమైన శక్తిగా, ఎవ్వరి పొత్తులు అవసరం లేదని ధీమాగా చెప్పగలిగేంత బలీయమైన శక్తిగా రూపొందించాడనే కదా.. దాని భావం! 

ఇప్పుడు చంద్రబాబు పాత కాంగ్రెస్ పొత్తులను గుర్తు చేస్తున్నాడంటే.. జగన్ తండ్రి కంటె బలవంతుడిగా ఎదిగాడని ఒప్పుకుంటున్నట్టే కదా? అని పలువురు విశ్లేషిస్తున్నారు. అందుకే చంద్రబాబులో అంత ఎక్కువగా భయం కలుగుతున్నదని కూడా అంటున్నారు. 

సాధారణంగా పుత్రాధిచ్ఛేత్ పరాజయం చాలా గొప్ప అనుభూతి అని పెద్దలంటారు. పుత్రుడి చేతిలో ఓడిపోవడం కూడా మధురంగానే ఉంటుందిట. అంటే కొడుకు తనకంటె గొప్పవాడు కావడం తండ్రికి ఆనందం కలిగిస్తుంది. ఇప్పుడు ఆ ఆనందాన్ని అనుభూతించడానికి తండ్రి లేకపోయినా.. తండ్రి కంటె గొప్పవాడు అయిన కొడుకును చూసి ఆయన అభిమానులంతా ఆనందిస్తుంటారు. 

చంద్రబాబు ఏదో ఒకటి అనాలి గనుక.. మాటలు పేర్చుకుని అంటున్నారు గానీ.. తన మాటల ద్వారా పరోక్షంగా తండ్రి వైఎస్సార్ కంటె జగన్మోహన్ రెడ్డి గొప్పగా ఎదిగినట్లు ఆయనే ఒప్పుకుంటున్నారు.

13 Replies to “చంద్రబాబు – పొత్తులపై పిచ్చి ప్రేలాపనలు!”

  1. అరేయ్ ఈ గ్రెట్ ఆంధ్ర నాకొడుకుని కుత్త పగిలే దాకా తన్నాలి ఈ నాకొడుకు పిచ్చి రాతలు rastunnadu

  2. సింగల్ గ్రామ సింహం అని తెలిసి పోయింది కదా , ఇంకా ఎందుకు ఈ సోది

Comments are closed.