జస్ట్ రెండేళ్ళు… ఆ మీదట అయిదేళ్ళు..

ఈ రెండేళ్ళు ఏంటి అయిదేళ్లు ఏంటి అసలు ఈ లెక్కలు ఏంటి అన్నది ఎవరికైనా ఒక్కసారిగా అడిగితే అర్ధం కాదేమో. కానీ రాజకీయం కాస్తా జోడిస్తే ఈ లెక్క బోధపడుతుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు…

ఈ రెండేళ్ళు ఏంటి అయిదేళ్లు ఏంటి అసలు ఈ లెక్కలు ఏంటి అన్నది ఎవరికైనా ఒక్కసారిగా అడిగితే అర్ధం కాదేమో. కానీ రాజకీయం కాస్తా జోడిస్తే ఈ లెక్క బోధపడుతుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ళ విరామం ఉంది. అందుకే రెండేళ్లు గట్టిగా కష్టపడండి అని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ నాయకులకు సూచిస్తున్నారు.

ముందు ఈ రెండేళ్ళు బాగా తిరిగి ప్రజలకు చేరువ అయితే మరో అయిదేళ్ల పాటు వైసీపీదే అధికారం. ప్రజలు కచ్చితంగా సెకండ్ టెర్మ్ వైసీపీని గెలిపిస్తారు అంటున్నారు సీనియర్ మంత్రి.  అయితే ప్రభుత్వ చేసిన కార్యక్రమాలు జనాల్లోకి వెళ్ళి చెప్పుకోవాలి, అలాగే ప్రజల కష్టనష్టాలను పంచుకోవాలి అంటూ బొత్స దిశా నిర్దేశం చేశారు.

ఇక మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉన్న అవకాశాలు తేడాను కూడా ఆయన విడమరచి చెప్పారు. మంత్రులకు ఒకే ఒక సచివాలయం ఉంది. అదే ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గంలో ఉన్న అన్ని సచివాలయాలూ వారివే కదా అంటూ బొత్స కొత్త విషయం చెప్పారు. 

సచివాలయాలను సందర్శించడం ద్వారా ఎప్పటికపుడు ప్రజా సమస్యలను తెలుసుకోవచ్చు, వాటిని పరిష్కరించవచ్చు అని కూడా సూచించారు.

వైసీపీని జనంలోకి తీసుకెళ్లాలి. అదే విధంగా గెలుపు బాట పట్టించాలి. ఈ విషయంలో రెండవ ఆలోచన వద్దు, రెండేళ్ళు మనవి కావు అనుకుంటే అయిదేళ్ళు మళ్ళీ మనవే అవుతాయి. ఇదీ బొత్స చెప్పిన రాజకీయ సూత్రం. మరి క్యాడరూ లీడర్ వంటబట్టించుకుంటే మంచిదే కదా.