పవర్ కోరిక తీరుస్తున్న సర్దార్

మొత్తానికి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పవర్ స్టార్ పవన్ కోరిక తీర్చబోతోంది. త్వరలో ఆయన ఓ ఇంటివాడు కావడానికి సాయంచేస్తోంది. ఇంటి వాడు అంటే మళ్లీ పెళ్లి కాదు.. స్వంత ఇల్లు కట్టోవడం.…

మొత్తానికి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పవర్ స్టార్ పవన్ కోరిక తీర్చబోతోంది. త్వరలో ఆయన ఓ ఇంటివాడు కావడానికి సాయంచేస్తోంది. ఇంటి వాడు అంటే మళ్లీ పెళ్లి కాదు.. స్వంత ఇల్లు కట్టోవడం. నిజానికి పవన్ కు స్వంత ఇల్లు వుంది. ఫార్మ్ హవుస్ వుంది. అయితే స్వంత ఇల్లు వాస్తు కారణాలతో కూలగొట్టేసారని వినికిడి. ఎప్పటి నుంచో దాన్ని తన అభిరుచులకు తగిన రీతిలో, చక్కగా కట్టుకోవాలన్నది పవన్ కోరిక. 

కానీ ఇంతవరకు అంత మొత్తం సమకూరక తీరడం లేదు. సర్దార్ సినిమా ఆ మేరకు పవన్ కు నిధులు అందించింది. సినిమాకు 40 కోట్ల నుంచి 45 కోట్ల వరకు ఖర్చు చేసారు. 95 కోట్లు అన్నీ కలపి మార్కెట్ చేసారు. పవన్ నటన, కథ, కథనాలు అన్నీ కలిపి 15 నుంచి 20 కోట్ల మధ్యలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. 

అది కాక, లాభాల్లో వాటా. అన్నీ కలిపి ముఫై కోట్ల వరకు పవన్ కు వచ్చినట్లు టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. సో.ఇక ఇప్పుడు త్వరలో ఇంటి పనులు మొదలు పెడతారని వినికిడి.