సినిమా పేర్లపైనే హీరోల ఇమేజ్ డ్యామినేషన్!

కథకు అనుగుణంగా కాదు… తమ హీరో ఇమేజ్  కు తగ్గ స్థాయిలో తమ సినిమాకు టైటిల్ పెట్టామని దర్శకులు చాలా గర్వంగా ప్రకటించేసుకొంటున్న రోజులివి. కథకు తగ్గ టైటిల్ తో ఏముంది… టైటిల్ సౌండింగ్…

కథకు అనుగుణంగా కాదు… తమ హీరో ఇమేజ్  కు తగ్గ స్థాయిలో తమ సినిమాకు టైటిల్ పెట్టామని దర్శకులు చాలా గర్వంగా ప్రకటించేసుకొంటున్న రోజులివి. కథకు తగ్గ టైటిల్ తో ఏముంది… టైటిల్ సౌండింగ్ హీరో ఇమేజ్ కు తగ్గ స్థాయిలో ఉంటే చాలన్నట్టుగా మారింది వ్యవహారం. చాలా వరకూ పెద్ద హీరోల సినిమాల టైటిళ్ల  తీరంతా ఇలానే ఉంది. తెలుగు కే కాదు.. దీనికి తమిళంలో కూడా ఏం తీసిపోదు. మన దగ్గర టాప్ హీరోల సినిమాలకు కథకు తగ్గట్టుగా గాక వారి వ్యక్తిగత క్యారెక్టర్ కు ప్రతిబింబం అంటూ సినిమాలకు టైటిళ్లు పెట్టేస్తుంటే తమిళనాట కూడా హీరోల లెక్కలను వివరించేలా ఉంటన్నాయి సినిమాల టైటిళ్లు!

వర్కింగ్ టైటిళ్లు అయినా.. ఇవే టైటిళ్లే కన్ఫర్మ్ అయినా.. ఇవన్నీ హీరోల ఇమేజ్ మీదే పూర్తిగా ఆధారపడ్డాయని స్పష్టం అవుతుంది. విజయ్ 61, తలా 57… ఇవీ ఇప్పుడు తమిళనాట ఇద్దరు స్టార్ హీరోల సినిమాల వర్కింగ్ టైటిళ్లు. బహుశా ఇవే టైటిళ్ల తోనే ఆ సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ టైటిళ్ల వెనుక మిస్టరీ ఏమనగా… హీరో విజయ్ తన కెరీర్ లో నటిస్తున్న 61 సినిమాను ‘విజయ్ 61’ పేరుతో లాగిస్తున్నారు. ఈ సినిమా ఇదే పేరుతోనే విడుదల అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మరి విజయ్ కు ధీటైన హీరోగా తమిళనాట పేరు పొందిన అజిత్ తన వ్యక్తిగత ఇమేజ్ కు అంత ప్రాధాన్యతను ఇవ్వడనే పేరునే కలిగి ఉన్నాడు. మేకప్ కు కూడా ప్రాధాన్యతను ఇవ్వకుండా రియల్ లుక్ లోనే కనిపించడానికి ప్రాధాన్యతను ఇస్తున్న హీరోగా పేరుంది అతడికి. అయినా కూడా ఇమేజ్ చట్రం నుంచి బయటకు రావడం కష్టమే కదా. అందుకు నిదర్శనమే ‘తలా 57’ అనే పేరు. తమిళనాట ఈ హీరో బిరుదునే టైటిల్గా మార్చారు అతడి 57 వ సినిమాకు. దీంతో అతడి సినిమా వ్యవహారానికంగా ‘తలా 57’ అయ్యింది. ఈ పేరుతోనే విడుదల అయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి హీరోల ఇమేజ్ డ్యామినేషన్లలో ఇదొక కొత్త అంకం కాబోలు.