టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, బాలీవుడ్ ఎంపరర్ ఖాన్ సల్మాన్ ఖాన్ కుటుంబానికి చాలా సాన్నిహిత్యం ఉందనేది మీడియా సర్కిల్స్ లో చాలా గట్టిగా వినిపించే అంశం. దీనికి పలు రుజువులను కూడా చూపుతుంది. చిరంజీవి ఇంటి ఫంక్షన్లకు సల్లూ హాజరు కావడం, రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి సల్మాన్ చొరవ తీసుకోవడం, ఈ మధ్యనే సల్మాన్ హిందీ సినిమా తెలుగు వెర్షన్ కు చెర్రీ డబ్బింగ్ చెప్పడం వంటి రీజన్లన్నింటినీ సల్మాన్, చిరు ఫ్యామిలీ కి మధ్య ఉన్న అనుబంధానికి రుజువులుగా చెబుతూ ఉంటారు.
మరి ఇంత అనుబంధ ఉన్నా.. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ వెర్షన్ విడుదలకు కు సల్మాన్ కుటుంబం నుంచే అడ్డుపుల్లలు పడటం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను ‘దబంగ్’ స్ఫూర్తితో రూపొందింది కాబట్టి .. హిందీ వరకూ ఆ కాన్సెప్టుపై మొత్తం రైట్స్ తమకే చెందుతాయి కాబట్టి.. పవన్ తాజా సినిమాను హిందీలో విడుదల చేయడానికి వీలులేదని సల్మాన్ సోదరుడు, దబంగ్ నిర్మాత కోర్టుకు ఎక్కాడు. చివరకు ఈ అడ్డు పుల్లలను పవన్ సినిమా ఏదోలా తప్పించుకున్నప్పటికీ… స్వయంగా సల్మాన్ కుటుంబం నుంచి చిరంజీవి కుటుంబానికి సంబంధించిన సినిమా విడుదలకు చట్టపరంగా అడ్డంకులు రావడం ఆసక్తికరమైన అంశం.
మరి పవన్ సినిమా హిందీలో విడుదలైపోయి ఏదో సంచలనం సృష్టించేసే అవకాశాలేమీ లేకపోయినా… దబంగ్ నిర్మాతలు వెంటనే అలర్ట్ అయిపోయారు. దీన్ని బట్టి.. సినిమా కుటుంబాల మధ్య అనుబంధాలు అనుబంధాలే… వీరి వ్యాపారాలు వ్యాపారాలే అనే నిత్యసత్యాన్ని గుర్తు చేసుకోవాలంతే!