రోజు రోజకు పెరిగిపోతున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా హైప్ చూసి నిర్మాత శరద్ మరార్ ఎగ్జయిట్ అయిపోతున్నారు. ఆయనకు జరుగుతున్నది కలా నిజమా అన్నట్లు వుందట. తను పవన్ తో ఓ సినిమా నిర్మించడం, అది పెద్ద సినిమా అవ్వడం అన్న ఊహించిందే కానీ, ఇలా ఓవర్ సీస్ తో సహా నార్త్ సౌత్ ను షేక్ చేసేంత ఊపు తెచ్చే రేంజ్ విడుదలకు ముందే వస్తుందని ఊహించలేదట.
అంతగా పవన్ పై జనాలకు వున్న అభిమానం, భగవంతుడి దయ అంటున్నారట. ఎవరు పలకరించినా ఆయన నోట మాట రానంతగా ఎగ్జయిట్ అవుతున్నారట. నిన్నటికి నిన్న అర్జెంట్ గా తిరుపతి వెళ్లి 'పెద్దాయిన'ను దర్శించుకుని వచ్చారట. పైగా సినిమా మీద పవన్ చూపిస్తున్న శ్రద్దకు ఫిదా అవుతున్నా అని అంటున్నారట.
మొన్నటికి మొన్న ప్రసాద్ ల్యాబ్ నుంచి ఇంటికి వెళ్దాం అనుకుంటే…'మీరు వెళ్లండి..నేను వుంటాను' అని పవన్ అనేసరికి ఆశ్చర్యపోయి, తాను కూడా అలా వుండిపోయాడట. మొత్తం మీద 95 కోట్ల మార్కెట్ అవుతున్న సినిమా నిర్మించిన నిర్మాతకు శరద్ కిందా మీదా అయిపోతున్నట్లు కనిపిస్తోంది.