అగ్రిమెంట్ కాన్సిల్ చేసిన నాగార్జున

బొత్తిగా బజ్ లేని వైల్డ్ డాగ్ సినిమాపై నాగార్జున చాలా నమ్మకం పెట్టుకున్నట్టున్నాడు. అందుకే మంచి డీల్ ను క్యాన్సిల్ చేసుకున్నాడు.  Advertisement ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ తో…

బొత్తిగా బజ్ లేని వైల్డ్ డాగ్ సినిమాపై నాగార్జున చాలా నమ్మకం పెట్టుకున్నట్టున్నాడు. అందుకే మంచి డీల్ ను క్యాన్సిల్ చేసుకున్నాడు. 

ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ తో నెట్ ఫ్లిక్స్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రేపోమాపో ఓటీటీ డైరక్ట్ రిలీజ్ డేట్ ప్రకటిద్దామనుకున్న టైమ్ కు నెట్ ఫ్లిక్స్ కు షాకిచ్చాడు నాగ్.

రీసెంట్ గా వైల్డ్ డాగ్ ఫస్ట్ కాపీ చూశాడు నాగ్. సినిమా ఔట్ పుట్ అతడికి బాగా నచ్చింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని అక్కడికక్కడ నిర్ణయించాడు. నాగార్జున తలుచుకోవడమే ఆలస్యం.. నెట్ ఫ్లిక్స్ తో అగ్రిమెంట్ ను కాన్సిల్ చేశాడు నిర్మాత నిరంజన్ రెడ్డి.

త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేసి, రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నారు నిర్మాతలు. సో.. వైల్డ్ డాగ్ సినిమా ముందుగా థియేటర్లలో ఆ తర్వాత మాత్రమే ఓటీటీలో కనిపించనుంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ స్టార్ట్ చేశారు.

నాగార్జున ఈ సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. డిపార్ట్ మెంట్ లో అంతా అతడ్ని ముద్దుగా వైల్డ్ డాగ్ అని పిలుచుకుంటారు. దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో అహితోష్ సాల్మన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

క‌మ్మవాళ్ళు వైఎస్ కు ఓట్లేసింది అందుకే

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ