ఈవారం ట్రేడ్ టాక్.. ‘చెక్’ పడింది

చెక్ సినిమాతో బాక్సాఫీస్ కు చెక్ పెట్టాలనుకున్నారు మేకర్స్. కానీ ప్రేక్షకులు రివర్స్ లో చెక్ పెట్టారు. మొదటి వారాంతం గడిచేసరికి నితిన్ సినిమా యావరేజ్ స్థాయి నుంచి ఫ్లాప్ రేంజ్ కు పడిపోయింది.…

చెక్ సినిమాతో బాక్సాఫీస్ కు చెక్ పెట్టాలనుకున్నారు మేకర్స్. కానీ ప్రేక్షకులు రివర్స్ లో చెక్ పెట్టారు. మొదటి వారాంతం గడిచేసరికి నితిన్ సినిమా యావరేజ్ స్థాయి నుంచి ఫ్లాప్ రేంజ్ కు పడిపోయింది.

మొదటి రోజే డల్ గా మొదలైన చెక్ సినిమా.. వీకెండ్ గడిచేసరికి మరింత డల్ అయిపోయింది. నిన్నటి ఆదివారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పట్టుమని 2 కోట్ల రూపాయల షేర్ కూడా రాలేదంటే.. సినిమా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు అటుఇటుగా 8 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 8 కోట్ల రూపాయలు కావాలి. వర్కింగ్ డేస్ తో ఈ వసూళ్లు సాధించడం దాదాపు కష్టం. మరోవైపు వచ్చే శుక్రవారం నాటికి ఏకంగా 8-9 సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చెక్ సినిమా గట్టెక్కడం అనుమానమే.

ఇక గత వారం విడుదలైన మిగతా సినిమాల విషయానికొస్తే.. అక్షర, క్షణక్షణం సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. విడుదలైన 3 రోజులకే ఈ 2 సినిమాలు దాదాపు ఫైనల్ రన్ కు చేరుకున్నాయి. అటు నాంది, ఉప్పెన సినిమాలు ఈ వీకెండ్ ఇంకాస్త లాభాలు మూటగట్టుకున్నాయి.

క‌మ్మవాళ్ళు వైఎస్ కు ఓట్లేసింది అందుకే

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ