‘గరం’ గరంగా రెండు కోట్లు ఫినిష్

పుత్రోత్సాహమే కాదు.. వాళ్ల మంచి చెడ్డలు కూడా తల్లితండ్రులకు అవసరమే. కొడుకు ఆది కెరీర్ ను ఓ లైన్ లో పెట్టాలని కిందా మీదా అవుతున్నారు నటుడు సాయి కుమార్. ఆ ప్రయత్నంలోనే ఆగిపోయిన…

పుత్రోత్సాహమే కాదు.. వాళ్ల మంచి చెడ్డలు కూడా తల్లితండ్రులకు అవసరమే. కొడుకు ఆది కెరీర్ ను ఓ లైన్ లో పెట్టాలని కిందా మీదా అవుతున్నారు నటుడు సాయి కుమార్. ఆ ప్రయత్నంలోనే ఆగిపోయిన సినిమాను చేతిలోకి తీసుకుని, ఫినిష్ చేసి, బోలెడు పబ్లిసిటీ ఖర్చు భరించి మరీ విడుదల చేసాడు. అదే గరమ్ సినిమా. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సత్తా చూపించలేకపోయింది. 

దర్శకుడు మదన్ అవుట్ డేటెడే డైరక్షన్ కారణం కావచ్చు, మరేమైనా కావచ్చు..మొత్తానికి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్క లేదు. దీంతో సాయి కుమార్ చేతికి తగిలిన ఖర్చు నికరంగా రెండు కోట్లు అంట. రెండు కోట్లు పోతే పోయింది.. మళ్లీ సంపాదించుకోవచ్చు.. కనీసం సినిమాకు కాస్త పేరు వచ్చి, కుర్రాడికి ఒకటి రెండు సినిమాలు వచ్చి వుంటే బాగుండేది.. అదే జరగలేదు అని ఫీలవుతున్నారట. 

వీరభద్రమ్ చౌదరితో చుట్టాలబ్బాయి సినిమా చేస్తున్నాడు ఆది. గెటప్ అదీ బాగానే వుంది. మరి పూలరంగడు లాంటి హిట్ గా తయారుచేస్తాడో, భాయ్ లా చేస్తాడో వీరభ్రదమ్ చౌదరి చూడాలి. దానిపైనే ఆదారపడి వుంది ఆది భవిష్యత్.