రామ్ గోపాల్ వర్మ.. మంచు మనోజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అటాక్. ఈ సినిమా కలెక్షన్లు చూస్తుంటే ఆర్జీవీ పేరు ప్రతిష్ఠలు ఏమేరకు పడిపోయాయో అర్థం అవుతుంది. శౌర్య సినిమా కు టాక్ బాగా రాలేకున్నా, కనీసం థియేటర్ అద్దెలన్నా వచ్చాయి.
కానీ అటాక్ సినిమాకు థియేటర్ అద్దెలు కూడా ఎదురు కట్టాల్సిన పరిస్థితి వుందట నిర్మాతకు. ఒక్కో థియేటర్ కు రోజుకు అయిదు వేలు, ఆరువేలు లెక్కన కలెక్షన్లు వున్నాయని వినికిడి. నిజానికి మనోజ్ లాంటి యాక్టివ్ స్టార్ తో ఆర్జీవీ సినిమా చేసాడు అంటే కనీసం ఓపెనింగ్స్ అయినా వుండాలి.
ఆ తరువాత సినిమా మంచి చెడ్డలు. అయితే ఆ కనీసం ఓపెనింగ్స్ కూడా లేవని వినికిడి.హీరో మనోజ్ కూడా ఈ సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తేలిసిందే. ఇధే కాదు, దీంతో పాటు విడులైన మరొకటి రెండు అతి చిన్న సినిమాల పరిస్థితి కూడా ఇలాగే వుందట. ఇవి కూడా థియేటర్లకు ఎదురు రెంట్లు కట్టాల్సి వుందట. ఒక్క నారా రోహిత్ సావిత్రి కి మాత్రం ఈ ఎదురు కట్టుడు సమస్య లేదట.