సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం హీరో పవన్ కళ్యాణ్ అన్నీ తానై ఎంత కష్టపడుతున్నాడో తెలుస్తోంటే ఆశ్చర్యం వేస్తోంది. ఆ సినిమాకు నిర్మాణంలో పాలు పంచుకున్నారు..స్క్రిప్ట్ అందించారు. ఇక డైరక్షన్, మిగతా వ్యవహారాల్లో ఆయన సలహాలు సూచనలు మామూలే. ఆఖరికి పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా అంతే శ్రద్ద తీసుకున్నారట.
నిన్నటికి నిన్న అంటే సోమవారం రాత్రి అంతా ఆయన ప్రసాద్ ల్యాబ్ ఆవరణలోనే గడిపారంట. నిజానికి ల్యాబ్ లో ఆ టైమ్ లో టెక్నికల్ వర్క్, కలరింగ్ వర్క్ జరుగుతోందని వినికిడి. దాని కోసం చెన్నయ్ నుంచి కేమేరా మెన్ ను రప్పించారు. కానీ పవన్ కూడా అక్కడే వున్నారట. రాత్రి తన కారులోనే నిద్రపోయారట. తెల్లవారు ఝామున రెండు గంటలకు లేచి ప్రసాద్ ల్యాబ్ లోనే అటు ఇటు వాకింగ్ చేసారట. తెల్లవారాక ఇంటికి వెళ్లారట. నిర్మాత శరద్ మురార్ కూడా తెల్లవార్లూ ప్రసాద్ ల్యాబ్ లోనే వున్నారట.
అన్నట్లు ఇంకో సంగతేమిటంటే..పవన్ మీసాలు తీసేసారని ఆ టైమ్ లో చూసిన వారు చెబుతున్న సంగతి. మీసాలు ఎందుకు తీసేసారో తెలియదని, చూడగానే కొత్తగా కనిపించారని చూసిన ఒకద్దరు అభిప్రాయపడ్డారు.