ఒక పెద్ద హీరోతొ పెట్టుకుని, తట్టుకుని ఓ చిన్న కమెడియన్ టాలీవుడ్ లో బతకగలడా? నిజంగా హీరో కత్త కడితే మాత్రం కష్టమే. వరాలచ్చే దేవుడే ఆగ్రహిస్తే అన్నట్లు అయింది కమెడియన్ షకలక శంకర్ పరిస్థితి. పవన్ నా దేవుడు..అంతకన్నా ఎక్కువ అనుకున్నాడు..అంటున్నాడు చిరకాలంగా. అలాంటిది, షకలక ప్రవర్తన కారణంగా ఇప్పుడు ఆ దేవుడే రివర్స్ అయ్యాడు. ఎంత కాదని షకలక శంకర్ చెప్పినా, సెట్ లో జరిగింది వాస్తవం అని యూనిట్ జనాలకు తెలుసు..వాళ్లు బయట చెప్పగా విన్నవాళ్లకు తెలుసు.
అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, టాలీవుడ్ లో ఇలా చేయమని ఎవరూ చెప్పనక్కర లేదు. పెద్దవాళ్ల మనసు తెలుసుకుని ప్రవర్తిస్తారు సినిమా జనాలు. పవన్ కు కోపం వచ్చింది అంటే షకలక ను సినిమాలో పెట్టుకుంటే ఏమనుకుంటారో అని కచ్చితంగా ఆలోచిస్తారు. ఇక మెగా హీరోలు..రామ్ చరణ్, బన్నీ, సాయి ధరమ్, వరుణ్ తేజ్ వీళ్లంతా కాస్త ముందు వెనుక ఆలోచిస్తారు తమ సినిమాల్లో పాత్ర ఇవ్వడానికి. అలాగే మెగా డైరక్టర్లు వుంటారు..వారు కూడా పక్కన పెడతారు.
మళ్లీ పవన్ చెబితే తప్ప, టాలీవుడ్ లోని చాలా అవకాశాలు షకలకకు దూరం అయినట్లే. సరే పవన్ దూరం పెట్టాడు. కాబట్టి మన దగ్గరకు తీద్దాం అని పవన్ అంటే కిట్టని వాళ్లో, మెగా గ్రూప్ కు వ్యతిరేకంగా వుండేవాళ్లో దగ్గరకు తీసే ప్రయత్నం చేసారు అనుకుందాం..మరీ సమస్య గా మారిపోతుంది. టాలీవుడ్ ఈక్వెషన్లు అంతే..ఎప్పటికైనా పవన్ తో ఓ సెల్ఫీనొ, ప్రకటననో షకలక ఇప్పించుకోగలగాలి..అలా నమ్మకం కుదించగలగాలి..పవన్ కు తనంటే కోపం లేదని. లేకపోతే కష్టమే.