సీక్వెల్ లో కూడా అంతేగా..అంతేగా

అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 ఫ్రాంజైజీ/సీక్వెల్ ఎఫ్ 3 ట్రయిలర్ వచ్చేసింది. ఫ్రాంచైజీనో, సీక్వెల్ నో ఏదైతేనేం దాదాపుగా మళ్లీ అవే క్యారెక్టర్లు, అవే మ్యానరిజ‌మ్ లు, అవే డైలాగులు. కానీ…

అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 ఫ్రాంజైజీ/సీక్వెల్ ఎఫ్ 3 ట్రయిలర్ వచ్చేసింది. ఫ్రాంచైజీనో, సీక్వెల్ నో ఏదైతేనేం దాదాపుగా మళ్లీ అవే క్యారెక్టర్లు, అవే మ్యానరిజ‌మ్ లు, అవే డైలాగులు. కానీ ఈసారి అదనపు హంగులు తోడయ్యాయి. 

వెంకీకి రే చీకటి, వరుణ్ కు నత్తి. డబ్బు పిచ్చి కామన్. ఇంకా అదనంగా బోలెడు క్యారెక్టర్లు. ఆలీ, సునీల్ ఇలా. టోటల్ గా ట్రయిలర్ ను ఓ ఫన్ రైడ్ గా కట్ చేయాలనుకున్నారు. కట్ చేసారు.

కథ, విషయం ట్రయిలర్ లో పక్కన పెట్టేసారు. ఫన్..ఫన్ అన్నదే చూసుకున్నారు. తెరనిండా బోలెడు మంది నటులు. డైలాగుల మీద డైలాగులు. సీన్ల మీద సీన్లు. టప టపా పడిపోయాయి. ఒకదాన్ని డైజెస్ట్ చేసుకుని, నవ్వుకునేలోపు మరో డైలాగ్ పడేసారు. మరో సీన్ వచ్చేసింది. 

టోటల్ గా సమ్మర్ లో ఫ్యామిలీలను టార్గెట్ చేసి సీన్లు రాసుకున్నట్లు కనిపిస్తోంది. కథ జ‌స్ట్ థ్రెడ్ వుంటే చాలు అన్నట్లు తయరైన సినిమా అనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. 

ట్రయిలర్లో మైనస్ మార్కులు అంటూ పడితే అది దేవీశ్రీప్రసాద్ ఆర్ఆర్ కే. అస్సలు కొత్తగా ట్రయ్ చేయడం మానేసినట్లుంది. ఎఫ్ 3..అనే ఫన్..ఫ్రస్టేషన్..ఫార్ట్యూన్..కు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా ఫార్ట్యూన్ అంతా దిల్ రాజు దే.