నయనతార.. అనుష్క.. మధ్యలో కాజల్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా హీరోయిన్ ఎవరు అన్నది ఫైనల్స్ గుమ్మంలో ఆగింది. చిరంజీవి తన ఛాయిస్ గా నయనతార అన్నారు. బాగానే వుంది. జోడీ సరిపోతుంది. పైగా వినాయక్ కు కూడా నయన…

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా హీరోయిన్ ఎవరు అన్నది ఫైనల్స్ గుమ్మంలో ఆగింది. చిరంజీవి తన ఛాయిస్ గా నయనతార అన్నారు. బాగానే వుంది. జోడీ సరిపోతుంది. పైగా వినాయక్ కు కూడా నయన తారతో మంచి హిట్ లు వున్నాయి. అయితే వినాయక్ కొత్త పేరును ప్రస్తావించారు. ఆ పేరు.. కాజల్… ఆ పేరు విన్న చిరు.. కాస్త సరదా పడ్డారు కానీ.. కొంచెం మొహమాట పడ్డారని వినికిడి. 

కొడుకు చరణ్ పక్కన మూడు సినిమాలు చేసింది.. అలాగే తమ్ముడు పవన్ తో చేస్తోంది. ఇప్పుడు తనతో చేస్తే బాగుంటుందా అని కొంచెం ముందు వెనుక ఆడారు. అప్పుడు వినయ్… అనుష్క పేరును తెరపైకి తెచ్చారు. సరైన మ్యాచ్ అవుతుందని వినయ్ అంటున్నారు.

సో ఇప్పుడు వినయ్ ఛాయిస్ అనుష్క.. చిరు ఛాయిస్ నయనతార.. మధ్యలో కాజల్.. అదీ మెగాస్టార్ 150 వ సినిమా హీరోయిన్ పరిస్థితి.