మెగాస్టార్ సరసన అనుష్క?

త్రిష అయిపోయింది.. నయనతార క్లోజ్.. ఇప్పుడు అనుష్క వచ్చింది. ఇదంతా మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ముచ్చట. పక్కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి పక్కన హీరోయిన్ గా కత్తి రీమేక్ లో…

త్రిష అయిపోయింది.. నయనతార క్లోజ్.. ఇప్పుడు అనుష్క వచ్చింది. ఇదంతా మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ముచ్చట. పక్కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి పక్కన హీరోయిన్ గా కత్తి రీమేక్ లో హీరోయిన్ గా అనుష్క పేరు కూడా పరిశీలన లోకి వచ్చింది. మెగాస్టార్ పక్కన హీరోయిన్ గా చేయాలని అనుష్క కు చాలా కాలంగా వుంది. 

దాదాపు అందరు హీరోలపక్కన చేసినా, మెగాస్టార్ సరసన చేయలేదు.గతంలో జస్ట్ ఓ పాట మాత్రం చేసింది. హీరోయిన్ గా చేయని ఆ లోటు తీరాలని ఆమెకు వుంది. అందుకే ఈ కొత్త జోడీ ఆలోచన బయటకు వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం కత్తి టీమ్ స్టోరీకి మార్పులు చేర్పులు చేయడంలో చాలా బిజీగా వుంది. 

వన్స్ స్క్రిప్ట్ లాక్ కాగానే కాస్టింగ్ ప్రారంభిస్తారు. మే నెలలో కనీసం ఓ చిన్న షేడ్యూలు చేయాలని ఆలోచన వుంది. ఆ తరువాత ప్రతి నెల పది రోజుల వంతున ఓ ఆర్నెల్ల పాటు చేసి, వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలన్నది టెంటటివ్ ప్లాన్ గా వున్నట్లు తెలుస్తోంది.