విశాఖలో సరైనోడు ఫంక్షన్?

సర్దార్ గబ్బర్ సింగ్ అడియో ఫంక్షన్ ముగిసింది..ఇక బన్నీ-బోయపాట కాంబినేషన్ లోని సరైనోడు టైమ్ వచ్చింది. అయితే సరైనోడు సినిమా పాటలను ఏప్రిల్ 1న నేరుగా ఆన్ లైన్ లోకి విడుదల చేస్తున్నారు. దీంతొ…

సర్దార్ గబ్బర్ సింగ్ అడియో ఫంక్షన్ ముగిసింది..ఇక బన్నీ-బోయపాట కాంబినేషన్ లోని సరైనోడు టైమ్ వచ్చింది. అయితే సరైనోడు సినిమా పాటలను ఏప్రిల్ 1న నేరుగా ఆన్ లైన్ లోకి విడుదల చేస్తున్నారు. దీంతొ ఇక అడియో ఫంక్షన్ లేనట్లేనా అని ఫ్యాన్స్ డల్ అయ్యారు. అయితే అడియో ఫంక్షన్ ను మించి అడియో సక్సెస్ మీట్ లేదా అలాంటి ఫంక్షన్ ఒకదానిని సరైనోడు టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు సరైనోడు పాటలు నేరుగా విడుదల చేయడం ఏమిటి? అడియో ఫంక్షన్ ఎందుకు లేదు.. అంటే.. ఇదిగో ఆన్సర్.

ఈ నెలాఖరులో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె వివాహం బెంగళూరులో వుంది. రిసెప్షన్ హైదరాబాద్ లోవుంది.దాని తరువాత బన్నీ కొడుకు బర్త్ డే ఫంక్షన్ వుందని తెలుస్తోంది. ఈ లోగా గబ్బర్ సింగ్ 2 విడుదల వచ్చేస్తుంది. అంటే పది న కానీ తరువాత కానీ చేయాలి. కానీ అప్పటికి లేట్ అయిపోతుంది.. సినిమా విడుదల ఇక 12 రోజులే వుంటుంది. 

సో.. అందువల్ల పాటలు ఆన్ లైన్ లో విడుదల చేసేసి, 10న సక్సెస్ మీట్ లా ప్లాన్ చేస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నారు. ఈ పంక్షన్ ను విశాఖలొ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి విడుదల తరువాత విశాఖలో ఫంక్షన్ చేయడం, దాంతో మాంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే. సో, ఈ సారి కూడా విశాఖలోనే చేస్తే ఎలా వుంటుదని అల్లు అరవింద్..ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.