ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెండు మెగా మూవీలు రెడీ అయిపోతున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్..సరైనోడు సినిమాలు మిస్సెల్స్ లా దూసుకువస్తున్నాయి. జనవరి తరువాత వెల వెల బోతున్న బాక్సాఫీస్ క్యాష్ బాక్స్ ను కాపర్స్ తో కళకళలాడించడానికి ఈ రెండు సినిమాలు చాలా కీలకం. సాధారణంగా సినిమాలు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చిన దగ్గర నుంచి ప్రొడక్ట్ ఎలా వచ్చిందన్న దానిపై ఫీలర్లు మొదలవుతాయి.
వాటిలో కొంత వాస్తవం వుంటుంది. కొంత అవాస్తవం కూడా వుంటుంది. ఇప్పుడు ఇంతకీ ఈ రెండు సినిమాలపై వినిపిస్తున్నదేమిటి? సర్దార్ గబ్బర్ సింగ్ అవుట్ అవుట్ ఎంటర్ టైనీగా వుంటుంది.. సీన్లు సీన్లుగా నవ్వుకోవడానికి, ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి వీలుగా వుంటుంది. కథగానూ, ఓవరాల్ గానూ సినిమా సంగతి పట్టించుకోనక్కరలేదు. ఎక్కడిక్కడ జనానికి నచ్చేలా తీసారు.. అయితే సెకండాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది..
పవన్ ఫ్లాప్ లు అయిన తీన్ మార్, పంజాకు సమస్య ఏమిటంటే, ఆ సినిమాలు కాస్త హై ఫైగా వుంటాయి. కామన్ ప్రేక్షకుడికి కాస్త దూరంగా. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ అలా కాదు. పక్కా గ్రవుండ్ లెవెల్ లోనే వుంటుంది. బి సి సెంటర్ల ప్రేక్షకులు, అభిమానులు సీను టు సీన్ సరదా పడేలా వుంటుంది. ఇదీ సర్దార్ విషయంలో వినిపిస్తున్న ఇన్ సైడ్ టాక్.
ఇక సరైనోడు..ఫస్టాఫ్ ఓ రేంజ్ లో వుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి సినిమాలో హీరోయిజం, ఎమోషన్ పీక్ కు వెళ్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం కాస్త లెవెల్ తగ్గిందని వినికిడి. అసలు ఈ సినిమా అనుకున్నప్పటి నుంచీ సెకండాఫ్ నే సమస్య గా వుందని వినికిడి. దీని కోసమే బన్నీ-అరవంద్ స్క్రిప్ట్ వర్క్ ను ఆరు నెలలు పొడిగించారు. బోయపాటితో పదే పదే డిస్కషన్లు జరిగాయి. లేదూ అంటే ఈ సినిమా ఎప్పటికో రెడీ అయిపోవాలి. అలా ఆఖరికి ఓ పాయింట్ దగ్గర ఫిక్స్ అయ్యారు. మరి ఇలా రెడీ అయిన సెకండాఫ్ ఎలా వచ్చిందన్న దానిపై కాస్త భిన్నమైన వార్తలే వినిపిస్తున్నాయి. ఇదీ సరైనోడు వ్యవహారం.
రెండు సినిమాలు వంద కోట్ల వసూళ్లను టార్గెట్ చేసిన సినిమాలే. ఏమాత్రం బాగుంది అనిపించుకున్నా, యాభై కోట్లను వసూళ్లు దాటిపోయే సినిమాలే. చూడాలి మరి ఫలితాలు ఎలా వుంటాయో?