వేషం..ఊపిరి తీసేసారు

సినిమా రంగం భలే చిత్రమైనది.. రేవు దాటే దాకా ఓడ మల్లన్న.. రేవు దాటాక బోడి మల్లన్న అన్నట్లు వుంటుంది వ్యవహారం. ఊపిరి సినిమా విషయంలో క్యారెక్టర్ నటుడు రాజా రవీందర్ కు ఇలాగే…

సినిమా రంగం భలే చిత్రమైనది.. రేవు దాటే దాకా ఓడ మల్లన్న.. రేవు దాటాక బోడి మల్లన్న అన్నట్లు వుంటుంది వ్యవహారం. ఊపిరి సినిమా విషయంలో క్యారెక్టర్ నటుడు రాజా రవీందర్ కు ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కాస్త ఫుల్ లెంగ్త్ డిఫరెంట్ రోల్స్ వేయాలని ప్రయత్నిస్తున్నాడు రాజారవీందర్. సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు, గుంటూరు టాకీస్ ల్లో అలాంటి వేషాలు దక్కాయి. 

ఇదిలా వుంటే..నాగ్-కార్తీల సినిమాకు ఊపిరి అనే టైటిల్ కావాల్సి వచ్చింది. అది రాజా రవీందర్ దగ్గర వుంది. వెంటనే దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత పివిపి రాజా రవీందర్ ను ఆ టైటిల్ కావాలని అడిగారు.. రవీందర్ వేషాల ఇంట్రెస్ట్ తెలుసు కనుక, తమ సినిమాలో మంచి క్యారెక్టర్ వుందని, పోలీసు క్యారెక్టర్ అని డైరక్టర్ వంశీ చెప్పినట్లు వినికిడి.  పెద్దవాళ్లు అడిగారు కదా, పైగా మంచి వేషం కూడా ఇస్తామంటున్నారు అని వెంటనే సరే అనేసాడు… ఈయనే వాళ్ల ఆఫీసుకు వెళ్లి మరీ సైన్ చేసి వచ్చేసాడు. 

తీరా చేస్తే జూనియర్ ఆర్టిస్టు చేసే, సింగిల్ లైన్ డైలాగు వేషం ఒకటి రాజా రవీందర్ చేతిలో పెట్టారట. ఖంగుతిన్న రాజా రవీందర్ ఇంకేమీ మాట్లాడలేక, చేసి, వచ్చేసాడట. ఇంకా చిత్రమేమిటంటే, టైటిల్ ఫ్రీగా ఇచ్చేసిన రాజా రవీందర్ ను కనీసం అడియో ఫంక్షన్ కు కూడా ఆహ్వానించలేదట. అదేంటీ అని అడిగితే..సారీ బ్రహ్మోత్సవం హడావుడిలో బిజీగా వున్నాం మరిచిపోయాం అని సమాధానం వచ్చిందట. 

సినిమా రంగంలో పెద్ద వాళ్ల వ్యవహారాలు ఇలాగే వుంటాయ్. ఏదైనా డైరక్టర్ వంశీ తెలివే తెలివి.