చిన్నదో పెద్దదో.. ఓ డాక్టరేట్ వరించింది సీనియర్ నరేష్ ను. కానీ మన ఇండస్ట్రీ వ్యవహారం వేరు. బతికినా, పోయినా కూడా ఏవో ఈక్వేషన్లు వుంటే తప్ప నెత్తిన పెట్టుకోదు. అందుకే ఇప్పుడు సీనియర్ నరేష్ ను పట్టించుకున్నవారు లేరు. ' ఆ నలుగురు' చేతిలో వున్న 'మా' అసోసియేషన్ కు కూడా ఇప్పుడు నరేష్ కనిపించలేదు.
ఎవరికి పడితే వారికి శాలువా వేయడమో, వేయించుకోవడమో చేసే 'మా' పెద్దలకు నరేష్ కనిపించలేదు.. కప్పడానికి ఓ శాలువా దొరకలేదు. కళాకారులం.. మేమంతా ఒకటి.. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అనే టైపు నినాదాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 'మా' కార్యవర్గానికి ఎందుకు నరేష్ కనిపించలేదో మరి?
ఇక్కడ ఏం ఈక్వేషన్లు తేడా వచ్చాయో? ఇదే కనుక కాస్త ఫాలోయింగ్ వున్న హీరోకో, అవసరం వున్న వారికో వస్తే, ఇక హడావుడి వుండేది.. నా సామి రంగా..