త్రివిక్రమ్ కాపీ కొట్టిన సినిమా తెలుగులోకి?

అత్తారింటికి దారేది సినిమా గుర్తుందిగా..అందులో ఆకులు రాలే చెట్టు ఒకటి వుంటుంది. అబద్ధం ఆడినపుడల్లా ఆకు రాలుతుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కాన్సెప్ట్ ను ఓ ఇంగ్లీష్ సినిమా నుంచి తెచ్చుకొచ్చారు. 1000…

అత్తారింటికి దారేది సినిమా గుర్తుందిగా..అందులో ఆకులు రాలే చెట్టు ఒకటి వుంటుంది. అబద్ధం ఆడినపుడల్లా ఆకు రాలుతుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కాన్సెప్ట్ ను ఓ ఇంగ్లీష్ సినిమా నుంచి తెచ్చుకొచ్చారు. 1000 వర్డ్స్ ఆ సినిమా పేరు. చాలా అద్భుతమైన కథ, కథనాలు ఆ సినిమా సొంతం. అయితే అందులోని పాయింట్ మాత్రం తీసుకుని, సరదా కామెడీ ట్రాక్ అల్లి త్రివిక్రమ్ ముందుకు సాగిపోయారు అత్తారింటికి దారేది అంటూ. 

కట్ చేస్తే, ఇప్పుడు అదే సినిమా స్ఫూర్తిగా తెలుగులో సినిమా చేస్తే ఎలా వుంటుందీ అన్న ఆలోచనలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇంకా హీరో, దర్శకుడు ఇలాంటివి ఫైనల్ కాలేదు.జస్ట్ ఆలోచన స్టేజ్ లో వుంది వ్యవహారం. కానీ సమస్య ఒకటే..ఇప్పుడు ఈ సినిమా వస్తే, త్రివిక్రమ్ ను కాపీ కొట్టి చేసారు అంటారు మన జనాలు. 

ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు అందరికీ టచ్ లో వుండవు కదా.. టచ్ వున్నవారు మాత్రం.. ఓహో.. ఇక్కడి నుంచి తెచ్చుకొచ్చారా ఆ కామెడీ ట్రాక్ అనుకుంటారు.