మెగా హీరో దెబ్బకు మనోజ్ సినిమా మరింత వెనక్కు!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్  హీరో గా రూపొందించిన 'అటాక్'  పడుతూలేస్తోంది. ఇప్పటికే ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఇంకా త్వరలో.. అనే మాటతో మాత్రమే అంతో ఇంతో ఉనికిని…

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్  హీరో గా రూపొందించిన 'అటాక్'  పడుతూలేస్తోంది. ఇప్పటికే ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఇంకా త్వరలో.. అనే మాటతో మాత్రమే అంతో ఇంతో ఉనికిని చాటుకొంటోంది. మరి ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదాలకు కారణం ఒక మెగా హీరో సినిమా ఫలితమే అని తెలుస్తోంది. 

అటాక్ సినిమాకు నిర్మాత అయిన చిల్లర కల్యాణ్ ఆ మధ్య తీసిన 'లోఫర్' సినిమాతో పెద్ద ఎదురుదెబ్బనే తిన్నాడు. దీంతో మంచు మనోజ్ సినిమా విడుదల మరింత వెనక్కు పడింది.  లోఫర్ కన్నా ముందే అటాక్ విడుదల కావాల్సి ఉన్నా, కల్యాణ్ కు 'లోఫర్' పై చాలా నమ్మకం ఉండటంతో ఆ సినిమాను ముందుగా విడుదల చేశాడు. 

అయితే వరుణ్ తేజ్ రేంజ్ కు మించి ఖర్చు చేసి రూపొందించిన ఆ సినిమాతో కల్యాణ్ డెఫిషీట్ లోకి వెళ్లిపోయాడు. దీంతో అప్పటికే అష్టకష్టాలూ పడుతున్న అటాక్ కు అవి మరింత అధికం అయ్యాయి. దీంతో కల్యాణ్ ఆ సినిమాను విడుదల చేయలేకపోతున్నాడు. కానీ త్వరలో విడుదల చేస్తామని మాత్రం చెబుతున్నాడు. మరి 'శౌర్య' తో మనోజ్ మరో ఫెయిల్యూర్ ను మూటగట్టుకున్నాడు. మరి 'అటాక్' విడుదలకు శౌర్య ఫలితం కూడా ఒక ఎదురుదెబ్బేనేమో!