డేటింగ్ లో నిర్మాత కొడుకు, హీరో కూతురు!

ఒకవైపు బాలీవుడ్ లో బ్రేకప్ ల గురించి తెగ చర్చ జరుగుతోంది.  ఈ మధ్య కాలంలోనే అనేక జంటలు విడిపోవడం జరిగింది. హృతిక్ రోషన్, సుజానేలతో మొదలుకుని ఇప్పుడు అర్బాజ్ ఖాన్, మలైకాల మధ్య..…

ఒకవైపు బాలీవుడ్ లో బ్రేకప్ ల గురించి తెగ చర్చ జరుగుతోంది.  ఈ మధ్య కాలంలోనే అనేక జంటలు విడిపోవడం జరిగింది. హృతిక్ రోషన్, సుజానేలతో మొదలుకుని ఇప్పుడు అర్బాజ్ ఖాన్, మలైకాల మధ్య.. అనేక పెళ్లైన జంటలు, సహజీవనం చేస్తున్న జంటలూ విడిపోయాయి. మరి విడిపోతున్న సంగతలా ఉంటే కొత్త బంధాలు ఏర్పడటానికి లోటేమీ లేదు. విడిపోయిన వారు లేటేమీ లేకుండా మరొక పార్ట్ నర్ ను చూసుకొంటున్నారు. వారే కాదు.. సహజీవనం కల్చర్ విపరీత స్థాయికి చేరిన ఈ సినీ పరిశ్రమలో ఇప్పుడు మరో జంట వార్తల్లోకి వచ్చింది. 

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తనయుడు  హీరో అర్జున్ కపూర్, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి తనయ అతియా షెట్టిలు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని వారి సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం వారిద్దరూ కలిసి కాపురమే పెట్టేశారని, సహజీవనం చేస్తున్నారని తెలుస్తోంది. 

వరసగా వివిధ సినిమాలు ఫెయిల్యూరయిపోవడంతో..  ప్రస్తుతం కి అండ్ కా సినిమాపై బోలెడన్ని ఆశలతో ఉన్నాడు అర్జున్ కపూర్. 'హీరో' సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన సునీల్ షెట్టి తనయ కూడా ఇంకా బాలీవుడ్ లో హీరోయిన్ గా పాగా వేసేందుకు కష్టపడుతోంది. అయితే ఈ కష్టం నుంచి సేదతీరడానికి వీళ్లు డేటింగ్ ను మొదలుపెట్టినట్టున్నారు. మరి వీళ్ల ముచ్చట ఎంత కాలమో!