లేదు లేదంటూనే హీరోయిన్ విడాకులు!

కొద్ది రోజుల నుంచి అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ ల విడాకుల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ దంపతులిద్దరూ విడిపోనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖాన్స్ ఫ్యామిలీ ఖండిస్తూ వచ్చింది.…

కొద్ది రోజుల నుంచి అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ ల విడాకుల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ దంపతులిద్దరూ విడిపోనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖాన్స్ ఫ్యామిలీ ఖండిస్తూ వచ్చింది. వాళ్లిద్దరూ విడిపోవడం లేదని కౌంటర్ వాదన వినిపించసాగింది. మీడియావి ఒట్టి ఊహాగానాలు మాత్రమే అని తేల్చేస్తూ వచ్చింది ఆ కుటుంబం. అవునేమోలే.. అని అందరూ అనుకొంటున్న నేపథ్యంలో వీరి విడాకుల పిటిషన్ కోర్టుకు చేరినట్టుగా తెలుస్తోంది.

మలైకా ఆరోరా డైవోర్స్ ను కోరుతూ పిటిషన్ దాఖలు చేసిందని సమాచారం. దీంతో వీరి విడాకుల ప్రయత్నాలకు ధ్రువీకరణ లభించినట్టు అవుతోంది. ఖాన్ ఫ్యామిలీ సన్నిహితులు ఇస్తున్న సమాచారం ప్రకారం.. వీళ్ల మధ్య విబేధాలు నిజమే. అయితే విడాకుల వరకూ వెళ్లవద్దని అర్బాజ్ ఖాన్ అన్న సల్మాన్ ఖాన్ వీరికి సర్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. వారి మధ్య సంధి కుదర్చడానికి సల్లూ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. సల్మాన్ పంచాయతీతో కన్వీన్స్ కాని మలైక స్వయంగా డైవోర్స్ పిటిషన్ ను దాఖలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో పుకార్లే అనుకున్న విడాకుల వార్తను ఈ జంట నిజం చేస్తున్నట్టవుతోంది.

18 యేళ్ల కిందట వీరి వివాహం అయ్యింది. వీరికి ఒక తనయుడు ఉన్నాడు. అన్నేళ్ల అనుబంధం, అందుకు ఫలితంగా కలిగిన సంతానం కూడా వీరి బంధాన్ని నిలబెట్టలేకపోతోంది.