దర్శకుడు శ్రీను వైట్ల..ఇప్పుడంటే రెండు భయంకరమైన ఫ్లాపులు ఇచ్చిన డైరక్టర్ అయిపోయాడు. కానీ, ఒకప్పుడు ఆయన ఓ మంచి ట్రాక్ రికార్డు వుంది. ఓ ఫార్ములా సృష్టి కర్తగా పేరు వుంది. కానీ తను తయారు చేసిన ఫార్ములా నుంచి తనే బయటకు రాలేక, అక్కడే గింగిరాలు తిరుగుతూ, ఫ్లాపులు అందించడం ప్రారంభించాక పెద్ద హీరోలు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆఖరికి ఓ యంగ్ హీరో ఆదుకుని చాన్సిచ్చాడు. ఈ చాన్స్ కు ముందు రామ్, రానా ఇలా చాలా మందికి లైన్లు చెప్పాడు శ్రీను వైట్లు అని వినికిడి.
అయితే ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే..ఇలా లైన్లు చెప్పే దశల్లో ఇప్పుడు ఫీల్డ్ లో టాప్ రేసుగుర్రం..బన్నీకి కూడా ఓ కథ చెప్పాడట. అది అమితంగా నచ్చిందట బన్నీకి. కానీ ఇప్పుడు ఖాళీగా లేడు. విక్రమ్ కుమార్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు..ఇంకా మరి కొంత మంది లైన్లో వున్నారు. అందుకే కాస్త ఆగమన్నాడని వినికిడి.
సరే బన్నీ చాన్స్ ఇవ్వాలంటే తనకు ఓ హిట్ కావాలని శ్రీను వైట్ల డిసైడ్ అయ్యాడట. అందుకే ఎలాగైనా వరుణ్ తేజ తో సినిమా హిట్ కొట్టాలని సీరియస్ గా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. సో..అది హిట్ అయితే బన్నీ డేట్లు రెడీగా వుంటాయి. కానీ వరుణ్ తేజ సినిమాను కూడా రామ్ చరణ్ సినిమా మాదిరిగా డీల్ చేస్తే మాత్రం అంతే సంగతులు.