మహేష్ బాబు..పివిపి కాంబినేషన్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తయారవుతోంది బ్రహ్మోత్సవం. అడ్డాల శ్రీకాంత్ దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో పరుచూరి బ్రదర్స్ కూడా తమ వంతు ఓ చేయి వేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. బ్రహ్మోత్సవం కథ, కథనం విషయాల్లో మొదటి నుంచీ ఒక అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కు అన్నట్లు వుంది వ్యవహారం.
శ్రీకాంత్ చెప్పిన ఓ లైన్, టైటిల్ పట్టుకుని రంగంలోకి దిగిపోయారు. అయితే ఆ తరువాత కథ ఏమంత సజావుగా తయారు కావడం లేదని తరచు మహేష్ చిర్రుబుర్రులాడినట్లు వార్తలు వినవచ్చాయి. దీనికి తోడు శ్రీమంతుడు సినిమా తరువాత మహేష్ ఇమేజ్ బాగా పెరిగింది. బ్రహ్మొత్సవంలో హీరో పాత్ర ఎలివేషన్ ఈ లెవెల్ కు లేదని మహేష్ ఫీలయినట్లు తెలుస్తోంది.
దీంతో పివిపి చొరవతో రాఘవేంద్రరావు, ఆయన సూచనతో పరుచూరి బ్రదర్స్ రంగప్రవేశం చేసి కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం కొద్ది రోజులు షూటింగ్ ఆపి మళ్లీ ప్రారంభించారని వినికిడి. అయితే ఒకటే అనుమానం…ఆ పిలిచేదేదో, కొరటాల శివ లాంటి వర్తమాన టాలెంటెడ్ వాళ్లని పిలవక, నిన్నటి జనరేషన్ కు చెందిన పరుచూరి బ్రదర్స్ ను పిలవడం ఏమిటో?