గబ్బర్ సింగ్ 2 లో గందరగోళం?

ఇటీవల సినిమాలకు లీక్ ల బెడద ఎక్కువైంది. వివిధ విభాగాల నుంచి సినిమా ప్రాసెస్ కావడం అనివార్యం. ఈ ప్రాసెస్ లో ఎక్కడో ఒక దగ్గర లీక్ అయ్యే భయాలు ఇటీవల పెరిగాయి. ముఖ్యంగా…

ఇటీవల సినిమాలకు లీక్ ల బెడద ఎక్కువైంది. వివిధ విభాగాల నుంచి సినిమా ప్రాసెస్ కావడం అనివార్యం. ఈ ప్రాసెస్ లో ఎక్కడో ఒక దగ్గర లీక్ అయ్యే భయాలు ఇటీవల పెరిగాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలకు. అభిమానులు తమ హీరోల సినిమా ఎలా వుంటుందో, స్టిల్స్ ఎలా వుంటాయో, ఫస్ట్ లుక్ ఎలా వుంటుందో అన్న ఉత్సాహాన్ని కొండంతలుగా పెంచుకోవడమే ఇందుకు కారణం. పైగా సినిమా రంగంలో పనిచేసేవారికి అభిమానులు వుంటారు. వారు తమ తమ స్నేహితులకు తమ హీరో పిక్ లు, ఇతరత్రా ఫీడింగ్ ఇవ్వడం సరదాగా తీసుకుంటారు. ఇలాంటివే ఇప్పుడు సినిమాల పీకల మీదకు వస్తోంది.

గబ్బర్ సింగ్ 2 సినిమా మీద ఇప్పుడు వీర హైప్ వుంది. నిన్నటికి నిన్న ఆ సినిమాకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్ లు బయటకు వచ్చినట్లు వినికిడి. దీంతో నిర్మాణ వర్గాలు గాభరా పడ్డాయని తెలుస్తోంది. పవన్ కనిపించే కొన్ని సన్నివేశాల స్క్రీన్ షాట్ లు అలా బయటకు వచ్చిన వాటిలో వున్నాయని వినికిడి. అయితే వీటి క్లారిటీ చాలా లో గా వుంది.

స్క్రీన్ షాట్ లు కావడం వల్ల, పైగా వాటిని వాట్సప్ లో చలామణీ చేయడం వల్ల క్వాలిటీ బాగా తగ్గిపోయింది. కేవలం స్క్రీన్ షాట్ లు మాత్రమే వచ్చాయా లేదా ఫుటేజ్ ఏమన్నా వచ్చిందా అని నిర్మాణ వర్గాలు గాభరా పడ్డాయని వినికిడి. తరువాత అన్నీ చెక్ చేసుకుని, ఓకె..నథింగ్ టు వర్రీ అని అనుకున్నారని తెలుస్తోంది. 

ఏదైనా మరీ పెద్ద సినిమాలకు ఒక తలకాయనొప్పి కాదు.