పవన్..ప్రభాస్ శ్రీను డ్యాన్స్ లే డ్యాన్స్ లు

గబ్బర్ సింగ్ లో సూపర్ క్లిక్ అయిన ఎలిమెంట్ అంత్యాక్షరి. ఆ ఒక్క సీన్ తో అంత్యాక్షరి బ్యాచ్ చాలా సినిమాల్లో బుక్కయిపోయారు. దాని పవర్ అలాంటిది. అందుకే ఈసారి గబ్బర్ సింగ్ 2…

గబ్బర్ సింగ్ లో సూపర్ క్లిక్ అయిన ఎలిమెంట్ అంత్యాక్షరి. ఆ ఒక్క సీన్ తో అంత్యాక్షరి బ్యాచ్ చాలా సినిమాల్లో బుక్కయిపోయారు. దాని పవర్ అలాంటిది. అందుకే ఈసారి గబ్బర్ సింగ్ 2 లో కూడా అలాంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. అయితే ఈ సారి స్పెషల్ ఏమిటంటే..రౌడీ బ్యాచ్ డ్యాన్స్ లు కాదు..సాక్షాత్యూ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే రకరకాల డ్యాన్స్ లు విరగదీసారని వినికిడి. 

పవన్ కు ఈ సీన్లలో సపోర్టింగ్ నిలిచింది ఎవరో కాదు. ఇటీవల చాలా సినిమాల్లో తన కామెడీతో దూసుకుపోతున్న ప్రభాస్ శ్రీను. శ్రీను..సిద్దప్ప శీను అంటూ వచ్చి, ఇప్పుడు రకరకాల వేషాలు వేస్తున్న ప్రభాస్ శ్రీనుకు పవన్ తన సినిమాలో మంచి రోల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పవన్..ప్రభాస్ శీను కలిసి గబ్బర్ సింగ్ 2 లో అంత్యాక్షరి సీను ఏ మేరకు విరగదీసారో చూడాలంటే మరో నెలపైనే ఆగాలి.