జీవా, హన్సిక జంటగా పోకిరి రాజా

రంగం సినిమా తరువాత జీవా నటించిన సినిమాలు అడపదడపా వస్తూనే వున్నాయి..పోతూనే వున్నాయి. సరైన హిట్ మాత్రం పడడం లేదు. మళ్లీ మరో ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. పోకిరి రాజా టైటిల్ తో ఫన్…

రంగం సినిమా తరువాత జీవా నటించిన సినిమాలు అడపదడపా వస్తూనే వున్నాయి..పోతూనే వున్నాయి. సరైన హిట్ మాత్రం పడడం లేదు. మళ్లీ మరో ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. పోకిరి రాజా టైటిల్ తో ఫన్ ఆఫ్ విండ్ అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు మరో సినిమా వస్తోంది. ఈ సినిమా జీవా తమిళంలో నటించిన 25వ చిత్రం కావడం విశేషం. హన్సిక మోత్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రామ్ ప్రకాష్ రాయప్ప దర్శకుడు. ప్రముఖ నటుడు సత్య రాజ్ తనయుడు సిబిరాజ్ ప్రతినాయకుడిగా నటించాడు.

ఎస్ ఎస్ వి ఎస్ క్రియేషన్స్ సమర్పణలో, సాయి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, వి.హానీ ప్రమోధ్ మరియు శ్రీను సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు పోకిరి రాజ్ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడ్డప్పటికీ ఫ్యాన్సీ రేటు ఇచ్చి తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమ్మాన్ సంగీతమందించారు.