Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రమ్యకృష్ణకు మరో లక్కీఛాన్స్.. మరోస్టార్ హీరో సరసన!

రమ్యకృష్ణకు మరో లక్కీఛాన్స్.. మరోస్టార్ హీరో సరసన!

చూస్తుంటే తన లేటెస్ట్ ఇన్నింగ్స్‌ను రమ్య చాలా మరపురానిదిగానే మలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోటి రూపాయల పారితోషకం డిమాండ్ చేస్తున్న కేరెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు సంపాదించుకున్న రమ్యకు స్టార్‌ల పక్కన అవకాశాలు కూడా అదే స్థాయిలో దక్కుతున్నాయి. బాహుబలి వంటి భారీ సినిమా తర్వాత రమ్య నాగార్జున, మోహన్ బాబు వంటి హీరోలతో జతకట్టింది. వీటిల్లో నాగార్జునతో సినిమా సూపర్ హిట్టయ్యింది కూడా! 

భారీ వసూళ్లను సాధించిన ఆ సినిమా తర్వాత రమ్యపై స్టార్ హీరోల కన్ను పడింది. ఇలాంటి కన్నేసిన స్టార్ హీరోల్లో కమల్ హాసన్ కూడా ఉండటం విశేషం. తన వయసుకు తగ్గ హీరోయిన్లతో వరసగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు కమల్. ఈ నేపథ్యంలో రమ్యను కూడా తన జోడీగా ఎంచుకున్నాడట ఈ హీరో. అమల, శీదేవి వంటి తన అలనాటి హీరోయిన్లను తన తాజా సినిమాల్లో నటింపజేసుకుంటున్నాడు కమల్.. ఇదే పరంపరలో ఒక మూవీలో రమ్యను హీరోయిన్‌గా అనుకొంటున్నాడు కమల్.

ఇది వరకూ కమల్ హీరోగా వచ్చిన పంచతంత్రంలో రమ్యకృష్ణ ఒక ప్రధాన పాత్రలో కనిపించింది. చేసింది వ్యాంప్ రోలే అయినా.. తన ప్రత్యేకతను నిరూపించుకొని కమల్‌తో హిట్ పెయిర్‌గా నిలిచింది రమ్య. మరి వీరి కాంబో ఈసారి రీపీట్ కావడం ఆసక్తికరమే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?