చార్మి.. తిరిగి ఆ డైరెక్టర్ కు దగ్గరయ్యే ప్రయత్నాల్లో!

మొదట్లో కృష్ణవంశీ ట్రూప్ మెంబర్ గా పేరు తెచ్చుకుంది చార్మి. ఇండస్ట్రీలో ఆ దర్శకుడికి బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ గా చెలామణి అయ్యింది. ఒక దశలో వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే గాసిప్స్…

మొదట్లో కృష్ణవంశీ ట్రూప్ మెంబర్ గా పేరు తెచ్చుకుంది చార్మి. ఇండస్ట్రీలో ఆ దర్శకుడికి బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ గా చెలామణి అయ్యింది. ఒక దశలో వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే గాసిప్స్ కూడా గుప్పుమన్నాయి. దానికి తోడు చార్మిని రకరకాలుగా ఎంకరేజ్ చేశాడు కృష్ణవంశీ. ఆమెను తన సినిమాల్లో నటింపజేయడమే కాకుండా ఆమె చేత తన సినిమాల్లో వేరే హీరోయిన్లకు కూడా డబ్బింగ్ చెప్పించి కృష్ణవంశీ చార్మిపై అభిమానాన్ని చాటుకున్నాడు. 

అయితే ఆ తర్వాత కృష్ణవంశీ ఫామ్ కోల్పోవడం … చార్మి బిజీ అయిపోవడం జరిగింది. గత కొంత కాలంగా చార్మికి పూరీ జగన్నాథ్ కంపెనీ లో ప్రాపకం పెరిగింది. పూరీ సినిమాల్లో నటించడం ఆయనతో కలిసి నిర్మాతగా మారడం, ఒక కన్నడ సినిమాకు చార్మినే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే ప్రయత్నం చేయడం వరకూ వెళ్లింది వ్యవహారం. ఆ తర్వాత వాళ్ల సాన్నిహిత్యంలో పొరపచ్చలొచ్చాయి. తన కేవ్ చుట్టుపక్కలకు కూడా రావొద్దని చార్మిని పూరీ హెచ్చరించడం జరిగింది. 

మరి పూరి క్యాంప్ ను వీడిన నేపథ్యంలో చార్మి మళ్లీ కృష్ణవంశీకి దగ్గరయ్యే ట్రయల్స్ లో ఉన్నట్టుంది. ఇటీవల ఆమె ఆ దర్శకుడి భజన చేస్తుండటమే ఈ అభిప్రాయాలను కలిగిస్తోంది. మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కృష్ణవంశీని తెగ పొగుడుతోంది చార్మి. ఆయన మేధస్సు చాలా గొప్పదని.. వచ్చే జన్మంటూ ఉంటే ఆయన మెదడును తన తలలో పెట్టుకుని పుట్టాలని ఉందని చార్మి అనేసింది. ఈ వి ధంగా క్రియేటివ్ డైరెక్టర్ పై అభిమానాన్ని ఒలకపోసింది చార్మి. మరి ఇంతటితో కృష్ణవంశీ కి చార్మి తో వచ్చిన గ్యాప్ తొలగిపోతుందా.. వీళ్లిద్దరూ ఒక్కటై మళ్లీ గతంలాగా పనిచేస్తారా.. ఈ దర్శకుడి లేటెస్ట్ వెంచర్ లో చార్మికి ఏమైనా స్థానం దక్కుందా…?వెయిట్ అండ్ సీ!