ఒక వైపు తెలుగు లో బిజీ ఆర్టిస్ట్ గానే ఉంది అవికా గోర్. చేతినిండా సినిమాలతో ఖాళి దొరికితే హిందీ సీరియల్స్ లో నటిస్తూ గడిపేస్తున్నా ఈ చిన్నారి పెళ్ళికూతురు కి సౌత్ లో క్రేజ్ మరింత పెరుగు తోంది. ఒకేసారి కన్నడ, తమిళ సినీ పరిశ్రమాల్లో అవకాశాలు సంపాదించు కుంటోంది అవిక. తెలుగు లో హిట్స్ మీద ఉన్న ఈ భామ పై ఆయా ఇండస్ట్రీ లు కన్నేశాయి.
తమిళంలో ప్రస్తుతం ఊపు మీద ఉన్న హీరో జీవీ ప్రకాష్ కుమార్ సినిమా లో హీరోయిన్ గా అవకాశం దక్కింది ఈమె కి. అలా గే అవిక కన్నడ ఎంట్రీ కి కూడా టైం వచ్చేసింది. కేర్ అఫ్ ఫుట్ పాత్ 2 అనే సినిమాతో అవిక శాండల్ వుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.
మరి ఒకవైపు తెలుగు, హిందీ భాషల్లో బిజీ గా ఉన్న అవిక కి తమిళ, కన్నడ లభించినవి మంచి అవకాశాలే అని చెప్పాలి. తెలుగు కన్నా కొంచెం లేట్ గానే అయినా అక్కడ కుడా అవకాశాలు లభిస్తున్నాయ్. చిన్న వయసు నుంచే బిజీ గా మారిన ఈ సీరియల్ సుందరి ఒకే సారి నాలుగు ఇండస్ట్రీ లలో ఎలా ప్రయాణం సాగిస్తుందో చూడాలి.