శ్రీమంతుడు కోర్టుకెళ్లాడు

మొత్తానికి శ్రీమంతుడు కథ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. రచయిత శరత్ చంద్ర తను స్వాతి మాసపత్రికలో అనుబంధనవల గా అందించిన తన రచనను దర్శకుడు కొరటాల శివ కాపీ కొట్టారని అప్పుడే తన…

మొత్తానికి శ్రీమంతుడు కథ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. రచయిత శరత్ చంద్ర తను స్వాతి మాసపత్రికలో అనుబంధనవల గా అందించిన తన రచనను దర్శకుడు కొరటాల శివ కాపీ కొట్టారని అప్పుడే తన బాధను ‘గ్రేట్ ఆంధ్ర’తో పంచుకున్నారు. శరత్ చంద్ర తన కథను రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేసారు కూడా. తరువాత తెరవెనుక చాలా జరిగిందని వినికిడి. 

పదిలక్షల రూపాయిలు పరిహారం ఇస్తామని, పేరుమాత్రం ఇప్పుడు టైటిల్స్ లో వేయలేమని నిర్మాణ వర్గాలు శరత్ చంద్రను సంపద్రించినట్లు వినికిడి. కానీ దానికి శరత్ చంద్ర సమ్మతించలేదు. ఆ తరువాత మరి ఏమయిందో, ఇప్పుడు కోర్టు ముందుకు వచ్చింది వ్యవహారం.ఇదిలా వుంటే అప్పట్లోనే ఫేస్ బుక్ లో మరో అసిస్టెంట్ డైరక్టర్ కూడా దాదాపు శ్రీమంతుడు లాంటి కథనే తాను రాశానని, అది కూడా రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేసానని తన వాల్ మీద పేర్కొన్నారు. 

ఇండస్ట్రీలో వుండాలి, ఇక్కడ ఇది కామన్ కాబట్టి, తాను సైలెంట్ గా వూరుకున్నానని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. చిత్రమేమిటంటే, విషయాలు ఇంతలా ప్రచారం అవుతున్నా, తనకు ఏమీ తెలియదని కానీ, ఇదంతా తన స్వంతమే అని కానీ, దర్శకుడు కొరటాల శివ ఎక్కడా స్పందించకపోవడం. కానీ ఇప్పుడు విషయం కోర్టు మెట్లు ఎక్కింది కాబట్టి, ఇక స్పందించక తప్పదు.