వైజాగ్ రాజుగారిగా పేరు పొందిన నిర్మాత కొడుకు కార్తీక్ రాజు. టిప్పు అంటూ తొలిసినిమా ట్రయ్ చేసాడు కానీ ఫలితం అంతంత మాత్రం. అప్పట్లోనే మీడియా మీద ఖస్సుమన్నాడు. ఆ తరువాత సైలెంట్ అయ్యాడు. కట్ చేస్తే, అన్నపూర్ణ స్టూడియోలో క్రియేటివ్ వింగ్ లో పని చేసే చునియా అంటే నాగ్ ఫ్యామిలీకి ప్రత్యేక అభిమానం. అలాంటి చునియాతో ఒప్పందం పెట్టుకున్నారు వైజాగ్ రాజు.
రెండు కోట్లలో సినిమా తన కొడుకుతో సినిమా తీసి పెట్టేలా. అయితే ఈ సినిమాకు నాగ్ ఫ్యామిలీ ఎంత ప్రచారం చేయాలో అంతా చేసింది. ఒక విధంగా తమ ఫ్యామిలీ హీరోకి చేసిన దానికన్నా ఎక్కువ చేసారు. అయితే ఇక చివరకు వచ్చేసరికి నిర్మాత పబ్లిసిటీకి చేతులు ఎత్తేసారట. అదేంటీ అని అడిగితే, నాగార్జున గారు పబ్లిసిటీ చూసుకుంటామన్నారు. చునియా యాభై లక్షలతో పబ్లిసిటీ చూసుకుంటానన్నారు. కానీ ఇద్దరూ అలా చేయలేదు.. అని నిర్మాత బదులిచ్చినట్లు వినికిడి.
వైజాగ్ రాజుగారి కొడుకు సినిమా పబ్లిసిటీకి నాగార్జున ఎందుకు ఖర్చు పెడతా అన్నారో? చునియా మీద ఎంత అభిమానం వున్నా, ఓ మాట సాయం చేస్తారు కానీ, లక్షలు సాయం చేస్తారని ఎందుకుంటారు? ఇప్పటికే చేసింది ఎక్కువే అనుకోవాలి. ఏమయినా ఇక్కడేదో లింక్ మిస్సయినట్లు లేదూ?