సరైనోడు సినిమా చకచకా రెడీ అయిపోతోంది. ఇక త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా కథేమీ మరీ అంత కొత్తదో, లేదా చిక్కనిదో అని అభిమానుల ఆరాటం. అందుకే ఈ అప్ డేట్. ఆకతాయిగా తిరిగే కుర్రాడు(బన్నీ)..పదవిలో వున్న తండ్రి మరణిస్తే, ఎమ్మెల్యే అయిన హీరోయిన్ (కేథరన్), ఆమె వెంటపడతాడు..అదేంటీ అని అడిగితే, ‘ఏం..ఎమ్మెల్యేలు ప్రేమించరా..పెళ్లిళ్లు చేసుకోరా..మొగుళ్లు రారా’ అనే టైపులో రివర్స్ అవుతుంటాడు.
ఇదిలా వుంటే రకుల్ ప్రీత్ సింగ్ ది మరో కథ. ఆమెకు అయిన వాళ్లని, ఊరి వాళ్లని విలన్ చంపేస్తాడు. ఆమె మాత్రం లక్కీగా తప్పించుకుంటుంది. ఆమెను రక్షిస్తాడు హీరో. నిజానికి ఆ ఇద్దరికి చిన్న ఫ్లాష్ బ్యాక్ పరిచయం..పెళ్లి చూపుల్లాంటిది వుంటుంది. రకుల్ ను కాపాడ్డం..ఆమె నా మనిషి అని చెప్పడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుందని వినికిడి.
అలా ప్రథమార్థం ముగిసాక, ద్వితీయార్థం అంతా ఇక విలన్ అయిన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఆదితో హీరో బన్నీ ఢీ అంటే ఢీ అనడం మధ్య నడుస్తుంది.ఇక్కడ చిన్న సస్సెన్స్ లేదా ట్విస్ట్ వుంటుందని వినికిడి.
కథ వింటే కొంచెం భద్ర ఛాయలు వుంటాయని తెలిసిన వారు అంటున్నారు. మరి దీనికి బోయపాటి స్టయిల్ ట్రీట్ మెంట్ ఎలా వుంటుందో చూడాలి.సెకండాఫ్ అంటే బోయపాటి టైపు ట్రీట్ మెంట్ ఓకె. కానీ ఫస్ట్ హాఫ్ కు బన్నీ జులాయి, దేశముదురు టైపు ట్రీట్ మెంట్ కావాలి. అది బోయపాటికి కాస్త తక్కవ. మరి ఎలా చేసారు అన్నది చూడాలి.